Ys Jagan : షర్మిల ఆస్తుల వివాదంతో జగన్ కు రాజకీయ నష్టం లేనట్టే..?

Qubetvnews - October 27, 2024 / 09:10 AM IST

Ys Jagan : షర్మిల ఆస్తుల వివాదంతో జగన్ కు రాజకీయ నష్టం లేనట్టే..?

Ys Jagan : షర్మిల-జగన్ పేర్లు ఇప్పుడు దేశంలోనే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీరిద్దరి ఆస్తుల గొడవపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తల్లి, చెల్లిని జగన్ కోర్టుకు లాగాడంటూ ఇటు షర్మిల, అటు ప్రత్యర్థులు ఇంకోవైపు ఆయనకు వ్యతిరేక మీడియా మొత్తం కట్టగట్టుకుని ప్రచారం చేస్తోంది. జగన్ ను ఒక దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఈ వివాదం వల్ల జగన్ కు రాజకీయ నష్టం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆస్తుల వివాదం అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది వారి పర్సనల్.

అసలు ఏ ఇంట్లో గొడవలు ఉండవు.. అన్ని ఇళ్లలో గొడవలు ఉంటాయి.. దాన్ని రాజకీయ ప్రచారంగా వాడుకోవద్దు అనేది జగన్ వాదన. నిజమే కదా. అసలు జగన్ ఆస్తుల వివాదం వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. పైగా ఇప్పుడు ఆయనపై ఎన్ని రకాల ప్రచారాలు చేసినా ఆయనకు రాజకీయంగా నష్టం ఉండుదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేడు. పైగా షర్మిల వల్ల జగన్ కు కొత్తగా కలిగే నష్టం ఏమీ లేదు. గత ఐదేండ్లలో షర్మిల వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా జరిగేదీ ఏమీ లేదు.

ఇంకో విషయం ఏంటంటే.. ఈ గొడవ వచ్చే ఐదేండ్ల వరకు ఉండదు. ఆస్తుల వివాదం ఎంతో కొంత కాలం మాత్రమే ఉంటుంది. వచ్చే ఎన్నికల వరకు అసలు ఇది ఎవరికీ గుర్తే ఉండదు. దీని తర్వాత చాలా విషయాలు తెరమీదకు వస్తాయి. రాజకీయంగా జగన్ మళ్లీ బిజీ అయిపోతారు. ఐదేండ్ల వరకు టైమ్ ఉంది కాబట్టి.. జగన్ కు రాజకీయంగా మళ్లీ పుంజుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది. షర్మిల వివాదం కంటే కూడా.. కూటమితో జగన్ పోరాడే అంశంమీదనే ప్రజలకు కూడా ఆసక్తి ఉంటుంది.

కాబట్టి షర్మిల వివాదం వల్ల ఎటు చూసినా సరే జగన్ కు రాజకీయంగా కలిగే నష్టం అయితే ఏమీ లేదని అంటున్నారు. పైగా అటు కాంగ్రెస్ నుంచి కూడా షర్మిలకు వస్తున్న మద్దుతు ఏమీ లేదు. ఇంకోవైపు జగన్ బెయిల్ రద్దు కోసమే షర్మిల టీడీపీతో కలిసి కుట్ర చేస్తోందనే ప్రచారం వేగంగా ఊపందుకుంటోంది. జగన్ కు వైసీపీ పార్టీ మద్దతు ఉంది. కానీ షర్మిలకు మాత్రం కాంగ్రెస్ మద్దతు లేదు. కేవలం టీడీపీ ఆమెకు మద్దతు ఇస్తోంది.

ఇది ఆమెకు లాభం కన్నా నష్టమే చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే జగన్ వ్యతిరేక పార్టీ ఆమెకు మద్దతు ఇస్తే.. అది అంతిమంగా జగన్ కే లాభం చేస్తుంది. టీడీపీ, షర్మిల కలిసి ఇదంతా చేస్తున్నారనే ప్రచారం తెరమీదకు వస్తుంది. దాని వల్ల జగన్ మీదసానుభూతి కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని బహుషా షర్మిల మర్చిపోయినట్టు ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News