Pawan Kalyan : మహారాష్ట్రలో పవన్ మ్యాజిక్.. ఎన్డీయేకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడా..?

Qubetvnews - November 23, 2024 / 06:55 PM IST

Pawan Kalyan : మహారాష్ట్రలో పవన్ మ్యాజిక్.. ఎన్డీయేకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడా..?

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌.. ఇది పేరు కాదు తుఫాన్ అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించాడంటే పవర్ స్టార్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాణ్‌ ఇన్ని రోజులు ఏపీ పాలిటిక్స్ వరకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన మెల్లిమెల్లిగా పక్క రాష్ట్రాల్లో కూడా తన పవర్ చూపిస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ సభలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక డిప్యూటీ సీఎం వెళ్తే అక్కడి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే పవన్ మ్యాజిక్ అక్కడ బాగానే పనిచేసింది.

తెలుగు ఓట‌ర్ల ప్ర‌భావం ఎక్కువగా ఉన్న పూణె, బ‌ల్లాల్ పూర్, షోలా పూర్‌, తాలూర్‌, డెగ్లూర్ లాంటి నియోజ‌క వ‌ర్గాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్ షోలు, సభలు నిర్వహించారు. అక్కడ ఆయన సభలకు భారీ క్రేజ్ వచ్చింది. దాంతో పవన్ ఎఫెక్ట్ ఈ నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. పవన్ తన స్పీచ్ లలో హిందూత్వం, సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్స్ బాగా ప్లస్ అయ్యాయి. దాంతో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టే వచ్చింది.

దాంతో పవన్ ఇమేజ్ ప్రధాని మోడీ దాకా వెళ్లిందంట. పవన్ ను ప్రత్యేకంగా అభినందించినట్టు సమాచారం. ఈ దెబ్బతో బీజేపీ పెద్దల దృష్టిలో పవన్ పడ్డాడు. దాంతో ఆయన పవర్ ఏంటో వారికి అర్థం అయింది. ఇప్పటికే ప్రధాని మోడీ అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. పవన్ ఏం అడిగినా సరే కాదనట్లేదు. పైగా ఏపీకి వచ్చినప్పుడల్లా పవన్ ను హైలెట్ చేస్తున్నాడు. భవిష్యత్ లో కూడా పవన్ ను వాడుకేనే అవకాశాలు ఉన్నాయంట. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎన్డీయే తరఫున దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పవన్ ను వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అలా ఎన్డీయేకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియాలో పవన్ కు సెలబ్రిటీ స్టేటస్ ఉంది. కాబట్టి సౌత్ స్టేట్స్ లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ ను ప్రధానంగా వాడుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అలా పవన్ పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News