Ys Jagan : ఓటమి తర్వాత జగన్ మొదటి విజయం.. గాడిలో పడ్డ వైసీపీ..!
Qubetvnews - August 1, 2024 / 12:55 PM IST
Ys Jagan : వైసీపీ ఓటమి తర్వాత పార్టీలోని చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. ఓ వైపు కూటమి గెలుపుతో ఫుల్ జోష్ లో పథకాలను అమలు చేస్తూ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంటే.. వైసీపీలో సైలెన్స్ నెలకొంది. కానీ జగన్ వ్యూహంతో ఆ సైలెన్స్ ను ఛేధించి మళ్లీ పార్టీని గాడిలో పడేశారని అంటున్నారు. ఎందుకంటే జగన్ కు ప్రతిపక్షం అనేది కొత్త కాదు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, నేతలను ఒక్కతాటి మీదకు ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మళ్లీ పార్టీని పోరుబాటలో నిలిపేందుకు జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతే కాకుండా ఓటమి తర్వాత జగన్ కు మొదటి విజయాన్ని కూడా అందించింది. అదే ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేయడం. ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, హత్యలను ఖండించేందుకు ఆయన ఢిల్లీ వేదికను ఎంచుకోవడం బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఢిల్లీలో ధర్నా తర్వాతనే జగన్ కు తత్వం బోధపడినట్టుంది. ఎందుకంటే ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల జగన్ సానుభూతిని మూటగట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి పాలనను దేశం మొత్తానికి వినిపించారు. అంతే కాకుండా ఇండియా కూటమిలోని ఒక్క డీఎంకే పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు జగన్ కు మద్దతు పలికాయి.
ప్రధానంగా యూపీలోని బలమైన ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్ ధర్నాకు మద్దతు పలకడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అటు నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో, ఇటు ఏపీ మీడియాలో కూడా జగన్ కు సానుభూతి దక్కింది. ఇదే జగన్ ఓటమి తర్వాత సాధించిన తొలి విజయంగా చెప్పుకోవాలి. జగన్ పోరాటానికి ఎన్డీయే ప్రభుత్వం కూడా దిగొచ్చింది. ఏపీలో ఎలాంటి దాడులు జరగకుండా చూస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు బాల్ జగన్ చేతుల్లోకి వచ్చిందన్నమాట.
కాబట్టి జగన్ ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే ఆయనకు కచ్చితంగా మళ్లీ పాత రోజులు వస్తాయని అంటున్నారు. జగన్ పోరాటాన్ని చూసి వైసీపీ లీడర్లు కూడా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ పోరాటాన్ని జగన్ ఆపకపోతే ఆయనకే చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు జగన్ పోరాడేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏపీకి ప్రత్యేక హోదా కావచ్చు, సూపర్ సిక్స్ లాంటి అస్త్రాలు జగన్ కు అందుబాటులోనే ఉన్నాయి. మరి వాటిని ఆయన సక్సెస్ ఫుల్ గా వాడుకుంటాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.





