Dil Raju : దాసరి నారాయణ రావు స్థానం కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నారా..?

Qubetvnews - December 26, 2024 / 03:05 PM IST

Dil Raju : దాసరి నారాయణ రావు స్థానం కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నారా..?

Dil Raju : సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. లేదంటే ఏదైనా పంచాయితీ ఉన్నా ఎవరితో చెప్పుకోవాలి అంటే సమాధానం లేని ఓ ప్రశ్నగానే మిగిలిపోతుంది. సినిమా పెద్దగా ఎవరిని చూడాలన్నా సరే కొంత అనుమానమే. అప్పట్లో దాసరి నారాయణ రావు ఇండస్ట్రీ పెద్దగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరించారు. సినిమాల విషయంలో ఎవరికి ఎలాంటి గొడవలు ఉన్నా లేదంటే ఏమైనా ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినా సరే అందరితో మాట్లాడి ఆయన పరిష్కరించేవారు. అందుకే అందరూ ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగా గౌరవించారు. ఆయన చెబితే అందరూ విన్నారు కూడా. పైగా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఆయన వారధిగా ఉన్నారు.

ఆయన చనిపోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఎవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. మోహన్ బాబు అప్పట్లో కొంత ప్రయత్నించినా ఆయనకు సెట్ కాలేదు. కానీ ఇప్పుడు దిల్ రాజు ఆ స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఏపీ ప్రభుత్వంతో ఇండస్ట్రీకి సమస్య వచ్చినప్పుడు కూడా దిల్ రాజు రంగంలోకి దిగి కొంత పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ముందుండి కథ నడిపించినా.. దిల్ రాజు ప్రయత్నం కూడా అందులో ఉంది. ఇప్పుడు పుష్ప-2 వివాదం నేపథ్యంలో మళ్లీ దిల్ రాజు ఎంట్రీతోనే అది సద్దుమణుగుతోంది.

దిల్ రాజు ఎంట్రీ కాక ముందు ఈ సమస్య పెద్దదిగా ఉంది. కానీ దిల్ రాజు వచ్చిన వెంటనే పరిహారం లక్షల నుంచి రూ.2కోట్లకు వెళ్లిపోయింది. దాంతో విమర్శకుల నోర్లకు తాళం పడింది. అంతే కాకుండా సినిమాల బెన్ ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంచడానికి తెలంగాణ ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీ భేటీ వెనక కూడా దిల్ రాజు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎఫ్‌ డీసీ చైర్మన్ గా ఉండటం ఆయనకు బాగా కలిసి వస్తోంది. దీని వల్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇండస్ట్రీకి మధ్య వారధిగా మారారు. దాంతో పాటు ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆయన ముందుండి పరిష్కరిస్తూ.. తాను చెప్పకపోయినా ఇండస్ట్రీ పెద్ద అనే ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

చిరంజీవి, మురళీ మోహన్, డైరెక్టర్ రాఘవేంద్ర రావు, అశ్వినీదత్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్లు ఉన్నా సరే.. వారు అన్ని విషయాల్లో దిల్ రాజు లాగా ఎంట్రీ ఇవ్వట్లేదు. ఇదే సందర్భంలో ఆ ఛాన్స్ ను కొట్టేస్తున్నాడు దిల్ రాజు. తనను పిలిచినా పిలవకపోయినా ఎంట్రీ ఇస్తూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు. మొత్తంగా ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా.. తన పనులతోనే ఇండస్ట్రీ పెద్ద అనే ముద్ర వేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు దిల్ రాజు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News