2024 Rewind : 2024 రివైండ్.. ఈ ఏడాది వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!
Qubetvnews - December 29, 2024 / 01:23 PM IST
2024 Rewind : సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది జనాలకు అయితే ఈ ఏడాది కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది వివాదాల్లో చిక్కుకున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్టార్లు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అందులో ముందుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పుకోవాలి. ఇతనిపై లావణ్య అనే అమ్మాయి తనను మోసం చేశాడు అంటూ కేసు పెట్టింది. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆ
ఘటన మర్చిపోక ముందే జానీ మాస్టర్ కేసు తెరమీదకు వచ్చింది. ఆయనపై ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం చూశాం.
తనను రేప్ చేశాడని, మోసం చేశాడంటూ కేసు పెట్టడంతో జానీ మాస్టర్ ఏకంగా జైలుకు వెళ్లి వచ్చాడు. అతను ఇంకా ఈ కేసు నుంచి బయట పడలేదు. జాతీయ అవార్డు కూడా రద్దు అయింది. దాంతో జానీ మాస్టర్ ఎపిసోడ్ తీవ్ర వివాదాస్పదం అయింది. ఆ టైమ్ లోనే ఆర్జీవీ మీద కేసులు నమోదయ్యాయి. అతనికి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. కానీ అది పెద్ద రచ్చ కాలేదు. ఇలాంటి టైమ్ లోనే మంచు ఫ్యామిలీ వివాదం పెద్ద దుమారమే రేపింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్.. ఒకరిపై ఒకరు ఏకంగా కేసులు పెట్టుకున్నారు. ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లడం.. రిపోర్టర్ మీద దాడి తీవ్ర కలకలం రేపాయి.
మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సమయంలోనే పుష్ప-2 సంధ్య థియేటర్ ఎపిసోడ్ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు శ్రీతేజ్ హాస్పిటల్ లో ఉండటంతో రెండు వారాల పాటు ఈ వివాదం కొనసాగుతోంది. అల్లు అర్జున్ మీద కేసు పెట్టడంతో ఏకంగా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన తప్పేం లేదని బన్నీ చెబుతున్నాడు. ఇంకోవైపు ఈ కేసు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. చివరకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల హైక్స్, బెన్ ఫిట్ షోలను కూడా రద్దు చేసింది. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు.
మళ్లీ జైలుకు వెళ్తాడా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపు బన్నీ రేవతి కుటుంబానికి రెండు కోట్ల సాయం కూడా అందించారు. అయినా సరే వివాదం మాత్రం సద్దుమణగట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని అంతా చూస్తున్నారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద సినీ వివాదం అని చెప్పుకోవాలేమో.





