Allu Arjun : అల్లు అర్జున్ కి మళ్లీ బెదిరింపులు.. ఇదేం తీరు..!

Qubetvnews - December 30, 2024 / 10:16 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ కి మళ్లీ బెదిరింపులు.. ఇదేం తీరు..!

Allu Arjun :  అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కాని జాతీయ ఉతత్మ నటుడి అవార్డును కూడా తీసుకువచ్చారు. ఒక రకంగా ఆయన వల్ల తెలుగు ఇండస్ట్రీకి గౌరవం పెరుగుతోంది. అలాంటి వ్యక్తి నటనను చూసి అమితాబ్ లాంటి వారు కూడా ప్రశంసిస్తున్నారు. అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అది కావాలని తాను చేయలేదని అల్లు అర్జున్ పదే పదే చెబుతున్నారు. అలా అని చట్టాన్ని తప్పించుకుని తిరగట్లేదు కదా.. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు. ఇంత చేస్తున్నా సరే ఆయన్ను కొందరు కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అందరికీ విస్మయకరంగా అనిపిస్తోంది.

ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. ఏదో సంధ్య థియేటర్ ఘటనను సాకుగా చూపించి ఆయన ఇంటి మీదకు వెళ్లారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో ఎన్ని రకాలగా దుష్ఫ్రచారాలు చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇక బన్నీ ఇంటి మీద దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వారు మళ్లీ రెచ్చిపోయి మాట్లాడటం దారుణంగా ఉంది. వారు మళ్లీ అల్లు అర్జున్ ను బెదిరిస్తున్నారు.

ఈ సారి లక్ష మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతల అనుచరుడిగా ఉన్న రెడ్డి శ్రీనివాస్ ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. అసలు అతను ఇంత నేరుగా బెదిరించడం వెనక ఉన్నది ఎవరు. ఒక మామూలు వ్యక్తి ఏ ధైర్యం లేకుండా అంత పెద్ద సెలబ్రిటీ మీద ఇలాంటి కామెంట్లు చేయడు కదా అనే అనుమానాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. దేశ మంతా చూస్తోందన్న భయం కూడా అతనిలో కనిపించట్లేదు. మరి ప్రభుత్వం ఇలా వార్నింగ్ లు ఇచ్చే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోదా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఒక జాతీయ ఉత్తమ నటుడికి ఇచ్చే భద్రత ఇదేనా.. ఒక పెద్ద హీరోను బెదిరిస్తుంటే కనీసం పట్టించుకోరా అనే ప్రశ్నలు రాక మానవు.

ఇలాంటి వారు రెచ్చిపోతుంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. కచ్చితంగా ఇలాంటి వారిని నియంత్రించి హైదరాబాద్ ను శాంతి భద్రతల బ్రాండ్ ను కాపాడాలని సామాన్యులు కోరుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News