Pushpa-2 Collections : వివాదాలు, కొత్త సినిమాలు.. అయినా ఆగని పుష్పరాజ్ సునామీ..!

Qubetvnews - December 26, 2024 / 03:00 PM IST

Pushpa-2  Collections : వివాదాలు, కొత్త సినిమాలు.. అయినా ఆగని పుష్పరాజ్ సునామీ..!

Pushpa-2 Collections : పుష్ప-2 సినిమాకు ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే మూవీ కూడా చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా సరే మూవీకి ప్రమోషన్లు అనేవి బలంగా ఉండాల్సిందే. జక్కన్న తీసే సినిమాలకు అయినా సరే ప్రమోషన్లు భారీగా చేస్తేనే కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో వస్తుంటాయి. కేవలం హిట్ టాక్ పడగానే సైలెంట్ గా ఉంటే ఆ మూవీని జనాలు పెద్దగా పట్టించుకోరు. ఇది గతసినిమాలను చూస్తేనే ఇది అర్థం అవుతుంది. అందుకే అందరూ రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్ల జోరును మరింత పెంచుతారు. కానీ పుష్ప-2 సినిమాకు మాత్రం రిలీజ్ తర్వాత అసలు పెద్దగా ప్రమోషన్లే చేయట్లేదు.

ఏవో రెండో చిన్న ప్రెస్ మీట్లు పెట్టిన వెంటనే సంధ్య థియేటర్ వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత అసెంబ్లీలో రచ్చ.. బన్నీ ప్రెస్ మీట్ ఇలా ఈ వివాదం పీక్స్ కు చేరుకుంది. ఒక మూవీ చుట్టూ ఇంత పెద్ద వివాదం నడిస్తే కచ్చితంగా ఆ మూవీ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ పుష్పరాజ్ విషయంలో ఇది రివర్స్ గా ఉంది. ఈ మూవీ ఇప్పటికే అనుకున్న టార్గెట్ ను రీచ్ అయిపోయింది. ఈ మూవీ రూ.1500 కోట్ల కలెక్షన్లను దాటిపోయింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా మూవీ రన్ అవుతూనే ఉంది. ఏ కొత్త సినిమాలు లేవు కాబట్టి ఈ మూవీకి జనాలు వెళ్తున్నారని అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే మొన్న క్రిస్మస్ కు కూడా చాలా సినిమాలు వచ్చాయి. అందులో చూసుకుంటే ఉపేంద్ర నటించిన యూఐ, అల్లరి నరేశ్ బచ్చలమల్లి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బరోజ్ ఏవీ కనీసం సరైన ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయాయి. ఇక కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. ఇవేవీ పుష్పరాజ్ కలెక్షన్ల మీద కొంచెం కూడా ఎఫెక్ట్ చూపించలేదు. అటు బాలీవుడ్ లో కూడా బేబీ జాన్ మూవీ పుష్పరాజ్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చూస్తుంటే ఇంకో 15 రోజుల దాకా పుష్పరాజ్ కలెక్షన్ల తుఫాన్ ఆగేలా కనిపించట్లేదు. సంక్రాంతి తర్వాతనే సౌత్ ఇండియాలో పుష్పరాజ్ సునామీ ఆగేలా ఉంది.

సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు పుష్ప-2 హంగామా తగ్గడం ఖాయం. ఈ లెక్కన అప్పటి దాకా అంటే పుష్పరాజ్ కు చాలా లాంగ్ గ్యాప్ దొరికినట్టే. కాబట్టి ప్రమోషన్లు చేయకున్నా సరే కలెక్షన్లకు ఎలాంటి ఢోకా లేదన్నమాట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News