విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్

Naveen Kumar Kasba - August 5, 2025 / 07:04 PM IST

విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్

భారతదేశంలో ఉన్నత విద్యకు ఒక పెద్ద అడుగుగా, జార్జియాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన SEU – జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.2025 ఆగస్టు 5న, SEU ప్రతినిధులు మరియు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) అధికారుల మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం (MoU) కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం, SEU కొత్త VMRDA షిప్ డెక్ భవనంలోని మూడవ అంతస్తును లీజు ప్రాతిపదికన తీసుకుంటుంది. ఈ క్యాంపస్ భారతదేశంలో SEU యొక్క కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. యూరప్ దాటి SEU- జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఇలా విస్తరించడం ఇదే మొదటిసారి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

ఎం.వి. ప్రణవ్ గోపాల్, VMRDA చైర్మన్
కె.ఎస్. విశ్వనాథన్, IAS, VMRDA కమిషనర్
చిరాగ్ వాఘేలా, కో- ఇన్వెస్టర్, SEU
జె.వి. మూర్తి, ఇండియన్ ఆపరేషన్స్ డైరెక్టర్, SEU
విన్నీ పాఠ్రో, అడ్వైసర్, SEU

2025 సంవత్సరంలో కొన్ని నెలల క్రితం SEU – జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రభుత్వంతో, మంత్రి నారా లోకేష్ సమక్షంలో కుదిరిన ఒప్పందం ఆధారంగా జరిగింది. అప్పుడు ₹1,300 కోట్ల పెట్టుబడి, 500కు పైగా ఉద్యోగాలు సృష్టించే ప్లాన్ గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ విద్యా కేంద్రంగా మారుస్తుందని, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ వస్తాయని లోకేష్ అన్నారు.

SEU క్యాంపస్‌లో ఉన్నత విద్య, AI, హెల్త్‌కేర్, బిజినెస్, ఇన్నోవేషన్‌లపై ఫోకస్ ఉంటుంది. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ , ఇంటర్నేషనల్ రీసెర్చ్, MIT లాంటి పెద్ద యూనివర్సిటీలతో ఒప్పందాలు ఉంటాయి.

ఈ సహకారం భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు కూడా మంచి పేరు తెస్తుంది.

SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం కాల్ చేయండి: 7337331607, 7337331608

Read Today's Latest Andhra Pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us