Parama Pada Sopanam : అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ నుండి 2వ లిరికల్ సాంగ్ ‘బూమ్ బూమ్’ విడుదల

Qubetvnews - May 30, 2025 / 09:47 PM IST

Parama Pada Sopanam : అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ నుండి 2వ లిరికల్ సాంగ్ ‘బూమ్ బూమ్’ విడుదల

Parama Pada Sopanam : ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాల్లో హీరోగా నటించి అలరించిన అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది ‘పరమపద సోపానం’. ఇటీవల ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. విడుదల తేదీ పోస్టర్ ను అలాగే ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.ఈ రెండిటికీ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాట బాగా వైరల్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్లలో భాగంగా 2వ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

‘భూమ్ భూమ్’ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్ ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో విడుదల చేశారు. స్టార్ సింగర్ గీతా మాధురి ఈ గీతాన్ని ఆలపించారు. ఆమె మాట్లాడుతూ.. ” ‘పరమపద సోపానం’ లో ‘భూమ్ భూమ్’ అనే పాటని పాడాను.నాగ శివ గారు పూరి గారి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు ‘పరమపద సోపానం’ ని తీసుకొస్తున్నారు. ‘భూమ్ భూమ్’ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చారు.

‘భూమ్ భూమ్’ పాటని గీతా మాధురి ఎంతో ఉత్సాహంగా అందరినీ హుషారెత్తించే విధంగా పాడారు. రాంబాబు గోశాల సాహిత్యం కూడా బాగా కుదిరింది. అన్నిటికీ మించి సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్ కి మంచి ‘పార్టీ సాంగ్’ గా వారిని అమితంగా ఆకట్టుకునే విధంగా ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News