jackpot for sreeleela : శ్రీలీల దశ తిరిగే ఆఫర్.. ఇన్నాళ్లకు దక్కిన ఛాన్స్..!
Qubetvnews - January 29, 2025 / 07:32 PM IST

jackpot for sreeleela : ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో శ్రీలీలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు చెబితే అందరూ గుర్తు పట్టేస్తారు. వరుసగా సినిమాలు కూడా చేసింది. కానీ ఏం లాభం.. హిట్లు మూరెడు అయితే ప్లాపులు బారెడు అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అందులోనూ ఆమె చేసిన సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఒక్కటి కూడా లేవు. అంతో ఇంతో భగవంత్ కేసరి మూవీతోనే ఆమెకు పేరొచ్చింది. మిగతావన్నీ కూడా మాడ్రన్ అమ్మాయిలా కనిపించే పాత్రలే. అందుకే ఆమెకు నటన పరంగా స్పెషల్ గుర్తింపు రాలేదు.
కానీ ఇప్పుడు కోలీవుడ్ లో ఆమె దశ తిరిగిపోయే ఛాన్స్ వచ్చింది. ఆకాశమే నీ హద్దురా సినిమా డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా పరాశక్తి సినిమాను తీస్తున్నారు. ఈ మూవీని 1965లో తమిళనాడులో ఉన్న కుల వివక్ష, అంటరానితనం, అగ్రకులాల అరాచకాలు, హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ఓ బలమైన పాత్రలో శ్రీలీలను తీసుకున్నారంట. వాస్తవానికి ఈ పాత్రలో నజ్రియాను తీసుకోవాలని అనుకున్నా.. చివరకు శ్రీలీలకు ఆ అవకాశం దక్కింది. ఈ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని టాక్ నడుస్తోంది. దాంతో శ్రీలీలకు ఇన్నాళ్లకు మంచి పాత్ర దక్కిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను కట్టి పడేస్తుందని.. ఇందులో అవకాశం మిస్ చేసుకున్న వారంతా తర్వాత బాధపడుతారని మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ గా చెబుతోంది. ఈ సినిమానే శ్రీలీలకు డెబ్యూ మూవీ కావడం విశేషం. కోలీవుడ్ లో ఇలాంటి సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలిసిందే. నటన పరంగా నిరూపించుకున్న వారికి కోలీవుడ్ లో అవకాశాలు బోలెడన్ని వస్తాయి. కోలీవుడ్ లో గ్లామర్ కన్నా కూడా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు శ్రీలీలకు ఎంట్రీ సినిమా పెద్ద హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఆమె కెరీర్ కు తిరుగుండదని అంటున్నారు.
తెలుగులో ఒకవేళ శ్రీలీలకు అలాంటి పాత్ర ఒక్కటి పడినా సరే ఆమెకు ఇప్పటికీ అవకాశాలు వచ్చి ఉండేవేమో. కానీ ఆమెకు అలాంటి పాత్రలు రాకపోవడంతో తన నటనను చూపించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఏదేమైనా ఇన్నాళ్లకు శ్రీలీలకు మంచి పాత్ర పడితే అదే చాలు అంటున్నారు ఆమె అభిమానులు.