Ram charan : రామ్ చరణ్ కు ఆ రెండు సినిమాలు చాలు.. ఇక తిరుగే లేదా..?
Qubetvnews - January 26, 2025 / 11:50 AM IST
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రతి కథ, డైరెక్టర్ ను ఎంచుకునే క్రమంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య ప్లాప్ అయింది. ఇక దాని తర్వాత మొన్న భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ పరంగా పర్వాలేదనిపించినా.. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో అప్పుడే చరణ్ మీద విమర్శలు స్టార్ట్ చేశారు కొందరు ఆంటీ ఫ్యాన్స్.
కానీ రామ్ చరణ్ లైనప్ చూస్తే మామూలుగా లేదు. ప్రస్తుతం అతను బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఈ మూవీ. స్పోర్ట్స్ నేపథ్యంలో తీస్తున్నాడు బుచ్చిబాబు. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే కొత్త హీరో, కొత్త హీరోయిన్ ను పెట్టి వంద కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఉప్పెన సినిమా ఇప్పటికీ ఓ సెన్సేషన్. తన గురువు సుకుమార్ లాంటి మేకింగ్ బుచ్చిబాబు సొంతం. కాబట్టి బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో అలాంటి సినిమా తీయబోతున్నాడనే టాక్ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ లుక్స్ ఊర మాస్ గా ఉన్నాయి.
ఇక మూవీ మామూలుగా ఉండదనేది అర్థం అవుతోంది. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ ఇప్పుడు నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి సుకుమార్ తీసే సినిమాలు ఊహకు కూడా అందని విధంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. కాబట్టి సుకుమార్ తో చేసే మూవీ రామ్ చరణ్ ను పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను డబుల్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ లెక్కన రామ్ చరణ్ కు బుచ్చిబాబు, సుకుమార్ తో చేసే సినిమాలు చాలని.. వాటితోనే రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లు అందుకుంటారని అంటున్నారు అభిమానులు. అందుకే రామ్ చరణ్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారంట.
ఇప్పుడు బుచ్చిబాబు సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దాని కోసం చరణ్ ప్రత్యేకంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడంట. ఇది కూడా ఏపీ విలేజ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడో చూడాలి.
