Ram Charan : రామ్ చరణ్ కు లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Qubetvnews - February 18, 2024 / 07:26 PM IST
Ram Charan :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతకు ముందు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన ఆయన క్రేజ్.. ఇప్పుడు బాలీవుడ్ ను దాటిపోయింది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి చేశాడు. ఆ మూవీ ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమాలోని సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా సొంతం అయిపోయింది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. దాని తర్వాత చాలానే సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు ఈ స్టార్ హీరో. అయితే రామ్ చరణ్ ఇప్పుడు క్లీన్ ఇమేజ్ తో ఉన్నాడు. ఇండస్ట్రీకి మెగాస్టార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా సరే ఏ మాత్రం గర్వం చూపించకుండా ఒద్దికగా ఉంటాడు. అంతే కాకుండా చాలా పద్ధతిగా ఉంటూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. అలాంటి చరణ్ మీద కూడా కొన్ని రూమర్లు అప్పట్లో సంచలనం రేపాయి. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు హీరోయిన్లతో రామ్ చరణ్ కు లవ్ ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి.
అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం నేహాశర్మ. చిరుత సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి నడుమ ఏదో సంథింగ్ ఉందంటూ వార్తా కథనాలు వచ్చాయి. ఎందుకంటే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ కలిసి బయట తిరుగుతూ కనిపించారు. దాంతో ఇద్దరి నడుమ ఏదో ఎఫైర్ ఉందంటూ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దాంతో ఆ వార్తలపై చిరు సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి రామ్ చరణ్ ఆమెతో బయట తిరగడం మానేశాడు. కానీ రామ్ చరణ్ ఆమెతో కేవలం ఫ్రెండ్లీగానే తిరిగాడన్నది మెగా కాంపౌడ్ వాదన.

Rumors Of Love Affairs Two Heroines Of Ram Charan
ఇక ఆమె తర్వాత మరీ ఎక్కువగా వినిపించిన పేరు కాజల్. ఈ భామతో రామ్ చరణ్ మూడు సినిమాలు చేశాడు. అయితే నాయక్ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరి నడుమ లవ్ ఎఫైర్ అంటూ సోషల్ మీడియాలో వార్త ఒకటి హల్ చల్ చేసింది. దాన్ని కూడా మెగా ఫ్యామిలీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
ఎందుకంటే రామ్ చరణ్ కు, కాజల్ కు మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని వారికి తెలుసు. అందుకే ఆ వార్తలను ఎన్నడూ కూడా రామ్ చరణ్ సీరియస్ గా తీసుకోలేదు. ఇక రామ్ చరణ్ కు ఉపాసనతో పెళ్లి అయిన తర్వాత పెద్దగా రూమర్లు రాలేదు. వీరిద్దరికీ ఇప్పుడు ఓ పాప కూడా పుట్టింది.
