Ferty9 Fertility Center: ఫాథర్స్ డే రోజు సరికొత్త ఆవిష్కరణ.. పిల్లలు లేని జంటలకు ఫెర్టీ9 ఇస్తున్న వరం
Qubetvnews - June 15, 2024 / 04:47 PM IST
Ferty9 Fertility Center: ఫెర్టీ9 సెంటర్ లో సంతాన సమస్యలకు ఉన్నన్ని పరిష్కారాలు ఇంకెక్కడా ఉండవనే చెప్పాలి. అంతగా ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతో సంతానం లేక బాధపడుతున్న జంటల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.

ఇప్పటికే ఫెర్టీ9 సెంటర్లు హైదరాబాద్,కరీంనగర్,వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో ఉండగా.. ఇప్పుడు మరో రెండు కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేశారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా రాజమండ్రి, తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ లను వర్చువల్ గా ఓపెన్ చేశారు. సికింద్రాబాద్ లోని ఫెర్టీ9 సెంటర్ లో ఈ ఈవెంట్లను నిర్వహించారు. ఈవెంట్ కు హీరోయిన్ సంగీత ముఖ్య అతిథిగా వచ్చింది.

సంగీతతో పాటు ఫెర్టీ9 మెడికల్ డైరెక్టర్ జ్యోతి బూడి, సీఈవో వినేష్ ఘడియా కలిసి రాజమండ్రి, తిరుపతి బ్రాంచ్ లను వర్చువల్ గా లాంచ్ చేశారు. దాంతో పాటు ఫెర్టీ9 సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటగా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్య పెంపు కోసం కొత్తగా తెచ్చిన ఆండ్రో మ్యాక్స్ టెక్నాలజీ లోగోను కూడా వీరు ఆవిష్కరించారు.

అనంతరం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ను బ్రాంచ్ లో నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ఆఫర్లను తీసుకొచ్చే ఈ సంస్థ ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ ను ఇచ్చింది ఫాదర్స్ డే సందర్భంగా జులై 15 వరకు ట్రీట్ మెంట్ ఖర్చుల్లో 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.దాంతో పాటు కన్సల్టేషన్ ఫీజు కూడా ఉండదని తెలిపారు సంస్థ ప్రతినిధులు.

ఇక ఈ వేడుకలో ఫెర్టీ9 ద్వారా సంతానం పొందిన అనేక జంటలు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు. వేరే హాస్పిటళ్ల చుట్టూ పది నుంచి పదిహేనేళ్లు తిరిగినా ఫలితం లేక.. చివరకు ఫెర్టి9 కు వచ్చి సంతానం పొందిన వారు కూడా వచ్చారు. వారంతా ఫెర్టీ9 ద్వారానే తమ కల సాకారం అయినట్టు వివరించారు. ఇక కొత్తగా తెచ్చిన ఆండ్రో మ్యాక్స్ ద్వారా పురుషుల్లో ఉన్న సంతానోత్పత్తి సమస్యలను పూర్తిగా తగ్గించవచ్చని డాక్టర్ జ్యోతి వివరించారు.

హీరోయిన్ సంగీత మాట్లాడుతూ.. ఫెర్టీ9 సంస్థ కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేసి మరింత మందికి సంతాన ప్రాప్తిని కలిగించాలనుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. మున్ముందు ఈ సంస్థ ద్వారా మరింత మందికి పిల్లలు పుట్టి వారి కల నిజం కావాలని ఆమె కోరుకున్నారు.
