Congress plan about Kaleshwaram : కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్.. బీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టబోతుందా..?
Qubetvnews - February 26, 2024 / 09:33 AM IST
Congress plan about Kaleshwaram : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ ఎస్ ను ఎలా దెబ్బ కొట్టాలా అనే ఆలోచననే చేస్తోంది. ఇందులో భాగంగా అసలు బీఆర్ ఎస్ కు ఈ పదేండ్ల పాలనలో చెప్పుకోదగ్గవి ఏమున్నాయో.. వాటి లుకలుకలు ఏంటనేది బయట పెట్టేస్తూ బీఆర్ ఎస్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు లుకలుకలు ఏంటనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టేస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కుంగిన పిల్లర్లపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో కాళేశ్వరం అసలు రంగు ఏంటనేది బయట పడింది. అంతే కాకుండా దాని మీద అసెంబ్లీలో కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున చర్చ పెట్టి మరీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతో కాళేశ్వరం మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగా ప్రజల్లో కాళేశ్వరం మీద మరింత చర్చ జరగాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు.
అందుకే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల మీద ఇప్పుడు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం గురించి రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టబోతోంది. అంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ పెట్టి అందులో ఉన్న అవకతవకల గురించి బయట పెట్టడానికి రెడీ అవుతోంది. ఇలా చేయడం వల్ల బీఆర్ ఎస్ మీద ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం చేసి బీఆర్ ఎస్ ను ఘోరమైన దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి ప్లాన్ ను రెడీ చేసుకోబోతున్నారు. ప్రతి జిల్లాకు ఓ మంత్రిని నియమించి ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ ను చేపట్టబోతున్నారు. దాని వల్ల బీఆర్ ఎస్ మీద ప్రజల్లో ఉన్న కొద్ది పాటి ఇమేజ్ ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేసేసి కాంగ్రెస్ మీద సానుకూలత పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు రేవంత్.
ఇది వచ్చే ఎంపీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎఫెక్ట్ బీఆర్ ఎస్ ను ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే బీఆర్ ఎస్ కు ఘోరమైన పరాభవం తప్పదు. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనుకుంటున్న బీఆర్ ఎస్ కు ఈ విధంగా కాంగ్రెస్ చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి.
