Kcr : కాళేశ్వరం ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్..!

Qubetvnews - March 13, 2024 / 09:32 AM IST

Kcr : కాళేశ్వరం ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్..!

Kcr : ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా రచ్చ జరుగుతోంది కాళేశ్వరం గురించి మాత్రమే. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని.. కేసీఆర్ చేతకాని తనం వల్లనే నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా లక్ష కోట్లు ఇసుకలో వృథాగా పోయాయంటూ తెలిపింది కాంగ్రెస్ పార్టీ. పైగా కాళేశ్వరం మీద అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టడం అంతే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వెళ్లి పరిశీలించి దానిపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా చేశారు.

దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా కాళేశ్వరంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావట్లేదు. వాస్తవానికి కేసీఆర్ పదేండ్ల హయాంలో చెప్పుకోదగ్గ అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరం అనే చెప్పుకోవాలి. మరి కేసీఆరక్ పని తనానికి నిదర్శనంగా బీఆర్ ఎస్ భావిస్తున్న కాళేశ్వరంపై ఇలాంటి ఆరోపణలు అంటే అది కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే అని అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పటికే ఛలో నల్గొండ సభకు పిలుపునిచ్చారు. అందులో అసలు కాళేశ్వరం అంటే ఏంటి, ఏం జరుగుతోంది అనే విషయాలపై వివరించారు. అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు దెబ్బ పడేలా ఉన్నాయనే కారణంతో ఇప్పుడు కేసీఆర్ వాటికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కరీంనగర్ సభ పెట్టి సక్సెస్ చేసుకున్నారు. ఈ సభలోనే ఆయన మరో విషయాన్ని కూడా చెప్పేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు క్లారిటీ ఇచ్చేందుకు త్వరలోనే తాను టీవీల్లో మాట్లాడుతానని తెలిపారు.

వాస్తవానికి కేసీఆర్ గత పదేండ్లలో ఏ టీవీ ఛానెల్ కు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ పని చేయబోతున్నారు. త్వరలోనే అన్ని టీవీ ఛానెళ్లలో కాళేశ్వరంపై వివరణ ఇవ్వబోతున్నారు. దాని ద్వారా ప్రజలకు మరింత చేరువ కావొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

అంతే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా కాళేశ్వరంపై వివరణ ఇచ్చి ప్రజల్లో ఓ క్లారిటీ వచ్చే విధంగా చేయొచ్చు అనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇది ఒక రకంగా ఎంపీ ఎన్నికలకు ఎఫెక్ట్ పడకుండా కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడ అనే అంటున్నారు రాజకీయి నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News