Tbjp: టీడీపీని దూరం పెడుతున్న టీబీజేపీ.. జనసేనతో మాత్రం దోస్తీ..
Qubetvnews - July 1, 2024 / 06:22 PM IST
Tbjp: తెలంగాణలో టీడీపీ మళ్లీ పాగా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుంకటే ఇప్పుడు ఆ పార్టీకి ఏపీలో తిరుగులేని గ్రాఫ్ పెరిగింది. పైగా కేంద్రంలో కూడా టీడీపీ మంచి ఫామ్ లో ఉంది. అటు ఎన్డీయే సపోర్టు ఉంది కాబట్టి తెలంగాణలో తిరిగి పుంజుకోవాలని ఆశలు పెట్టుకుంటోంది. కానీ టీడీపీని టీ బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో బీజేపీతో పాటు జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని టీడీపీ ఆశ పడుతోంది. కానీ బీజేపీ అందుకు సిద్ధంగా ఉండట్లేదంట. దానికి కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అదేంటంటే… తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అధికారంపై ఆశలు పెంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఆశ పడుతోంది. పైగా తెలంగాణలో మొన్నటి ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఇంత మొత్తంలో సీట్లు రావడానికి టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి పడిందని కమలనాథులు అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకుంటే అది బీఆర్ ఎస్ కే లాభం జరుగుతుందని అనుకుంటున్నారంట. అందుకే టీడీపీతో కాకుండా జనసేనతో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కాపు కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.
కాబట్టి జనసేనతో పొత్తులు పెట్టుకుంటే ఆ సామాజిక వర్గం తమకు కలిసి వస్తుందని భావిస్తోందంట. ఇప్పుడు జనసేన కూడా ఏపీలో అధికారంలో ఉంది. త్వరలోనే తెలంగాణలో కూడా పార్టీని విస్తరించాలని పవన్ భావిస్తున్నారు. అందుకే బీజేపీతో అయితేనే తమకు బలమైన సపోర్టు ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతోనే కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నారు పవన్ కల్యాణ్. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా లాభం జరగలేదు.
కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి.. కచ్చితంగా ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో కచ్చితంగా పార్టీని విస్తరించుకోవాలని పవన్ కల్యాణ్ ఆశలు పెంచుకుంటున్నారు. చూడాలి మరి బీజేపీతో పొత్తులు జనసేనకు కలిసి వస్తాయా లేదా అనేది.




