Vaarahi Silks: వారాహి వంద రోజుల సెలబ్రేషన్స్ ఎప్పుడూ చూడని, ఎక్కడా వినని తరహాలో..!
Qubetvnews - January 21, 2025 / 05:47 PM IST
Vaarahi Silks: వారాహి పట్టుచీరల షోరూం ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం వంద రోజుల సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. వారాహి షోరూంను పెట్టిన వంద రోజుల్లోనే టఫ్ కాంపిటీషన్ ను తట్టుకుని లాభాలతో దూసుకుపోతోంది. అందుకే వారాహి సంస్థల అధినేత మణిదీప్, స్పందన దంపతులు వంద రోజుల సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. సాధారణంగా ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ వీరు మాత్రం తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఈ ప్రత్యేక వేడుక చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ వేడుకలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన ఉద్యోగులకి టీవీలు, ఫ్రిడ్జ్ లు, యాక్టివా బైక్, పల్సర్ బైక్ లు కూడా ఇచ్చారు.
ఈ రోజుల్లో వర్కర్ల కోసం ఇంత ఖరీదైన గిఫ్టులు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అసలు. ఏదో చాలీ చాలని జీతాలతో సరిపెట్టే ఓనర్లనే మనం చూశాం కానీ.. ఇలా వర్కర్ల హెల్త్ తో పాటు వెల్త్ ను కూడా ఆలోచించేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు మణిదీప్. తన షోరూంలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వారికి మొదటి ప్రైజ్ గా పల్సర్ బైక్, రెండో గిఫ్ట్ గా యాక్టివా, మూడో గిఫ్ట్ గా ఫ్రిడ్జ్, నాలుగో గిఫ్ట్ గా టీవీలను అందించారు. కేవలం గిఫ్ట్ లు ఇచ్చి ఆగిపోలేదు. తన సంస్థలో పనిచేసే అందరూ తన కుటుంబ సభ్యులుగా భావించి.. వారి కుటుంబాలకు రూ.5లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందించారు.

దాంతో అక్కడున్న ఉద్యోగుల కళ్లు చెమ్మగిల్లాయి. ఎందుకంటే ఒక బట్టల షోరూంలో పనిచేసే వర్కర్ల కోసం ఇంత చేసిన ఓనర్లు బహుషా ఎక్కడా ఉండరేమో. ఏ వ్యాపారి అయినా లాభాలను చూసుకుంటారు తప్ప.. ఉద్యోగుల కుటుంబాల కోసం, వారి జీవితాల కోసం ఆలోచించేవారు ఉండరు కదా. పైగా మణిదీప్ గారు ఇక్కడితోనే ఆపేస్తామని కూడా చెప్పలేదు. ఇదొక బెంచ్ మార్క్ లాంటిదేనని.. మొదటి యానివర్సీరీ వచ్చేసరికి ఇంతకంటే ఖరీదైన బహుమతులు కూడా ఇస్తామంటూ ప్రకటించారు. కొందరికి మాత్రమే వచ్చి మరికొందరికి రాలేదని దిగులు చెందొద్దని.. కష్టపడి పనిచేసే అందరికీ కచ్చితంగా ప్రోత్సాహకాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హీల్స్ లో పెట్టిన ఈ స్టోర్ తోనే ఆపేయకుండా.. ఏపీ, తెలంగాణ మొత్తంలో కలిపి కనీసం 50 స్టోర్లు ఓపెన్ చేస్తామని ప్రకటించారు. తమ కంపెనీలో పనిచేసే వారందరినీ అన్ని విధాలుగా అండగా ఉంటామని.. కస్టమర్లకు తమ మీద ఉన్న నమ్మకమే తమను ఈ స్థాయికి తెచ్చిందని.. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని వారు ధీమాగా ఉన్నారు.