Ys Jagan : మోడీ, షాలకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్.. నిజమేనా..?
Qubetvnews - May 29, 2024 / 01:03 PM IST
Ys Jagan : ఏపీలో అధికారం ఎవరిది అనే దానిపై ఇప్పుడు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కచ్చితంగా మాదే అధికారం అంటే మాదే అని అటు వైసీపీ పార్టీ ఇటు టీడీపీ కూటమి చెబుతున్నాయి. కానీ ఇంకా అధికారం ఎవరిదనేదానిపై క్లారిటీ రాలేదు. కానీ ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు చాలా వరకు వైసీపీకే అధికారం దక్కుతుందని తెలిపాయి. అంతే కాకుండా ఎగ్జిట్ ఫలితాల్లో కూడా ఇదే విషయం వెల్లడవుతుందని ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ మీద జగన్ సంచలన ప్రకటన చేశారు. భారీ సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు.
అయితే అసెంబ్లీ సీట్లు భారీగా సాధించడంతో పాటు అటు ఎంపీ సీట్లు కూడా భారీగానే సాధిస్తామని జగన్ ధీమాతో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు జగన్ ఏ జాతీయ పార్టీకి మొగ్గు చూపలేదు. న్యూట్రల్ గా ఉన్నారు. ఒకవేళ 15 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం అప్పుడు జాతీయ పార్టీలు జగన్ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కేంద్రలో ఈ సారి ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాదు అనే అంటున్నారు. కాగా ఎన్డీయే కూటమితో పొత్తులు పెట్టుకోవడానికి జగన్ సిద్ధంగా లేరంట. ఎందుకంటే ఆ పార్టీ టీడీపీ కూటమిలో చేరింది. పైగా ఎన్నికల్లో టీడీపీ కూటమికి వ్యవస్థలను సపోర్ట్ చేసేలా బీజేపీ చేసిందనే వాదన ఉంది.
అందుకే ఇప్పుడు వైసీపీలో బీజపీ పట్ల మంటెక్కిపోతోంది. కాగా కేంద్రంలో ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా సీట్లు వస్తే మాత్రం అప్పుడు కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాలని అనుకుంటోందంట వైసీపీ. తనపై కేసులు పెట్టించిందనే కోపం కాంగ్రెస్ మీద జగన్ లో ఉంది. కానీ రాజకీయాలు అన్న తర్వాత ఏమైనా జరగొచ్చు. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రచారం చేసిన చంద్రబాబుతోనే ఇప్పుడు బీజేపీ పొత్తులు పెట్టుకుంది. కాబట్టి ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. అదే విధంగా ఎన్డీయేలో చేరడం కంటే ఇండియా కూటమిలో చేరడమే బెస్ట్ అని జగన్ భావిస్తున్నారంట.
అలా చేరడానికి ముందు కొన్ని డిమాండ్లు పెట్టే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టి వాటికి ఒప్పుకున్న తర్వాతనే ఇండియా కూటమిలో చేరాలని జగన్ ప్లాన్ వేసుకుంటున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
అలా చేస్తే అటు తన బద్ద శత్రువు అయిన టీడీపీని కూడా ఇరకాటంలో పెట్టేయొచ్చు అని జగన్ భావిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అటు పార్టీ ప్రయోజనాలు కూడా ఆలోచిస్తున్నారు. రెండు విధాలుగా తనకు మేలు జరుగుతుందనే వానదతో ఆయన ఇండియా కూటమి వైపు వెళ్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
