Kalki : కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర ఇంకా ఉండనుందా..?
Qubetvnews - July 1, 2024 / 06:20 PM IST
Kalki : కల్కి సినిమాను చూస్తే చాలానే ప్రశ్నలు తలెత్తుతాయి. పురాణాల కథలను భవిష్యత్ కాలాని అనుసంధానిస్తూ.. సైన్స్ ను జోడించి మరీ తీశాడు నాగ్ అశ్విన్. చాలా బలమైన కథ ఇది. దాన్ని అర్థం చేసుకోవాలంటే.. పురాణాల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలి. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించాడు. ఈ అశ్వత్థామ మహాభారత కాలానికి సంబంధించిన వాడు. కృష్ణుడి శాపంతోనే అశ్వత్థామ కలియుగంలో కల్కికి సహకరించే బాధ్యతను నెరవేరుస్తాడు. అయితే పురాణాల ప్రకారం కల్కి అవతారానికి అశ్వత్థామ ఒక్కడే సహకరిస్తాడు.
కాబట్టి కల్కి సినిమాలో ప్రభాస్ ను అందరూ కల్కి అని అనుకున్నారు. కానీ కల్కి ప్రభాస్ కాదని సినిమా మొదట్లోనే హింట్ ఇచ్చేశాడు నాగ్ అశ్విన్. దీపికా పడుకొణె కడుపులో పెరుగుతున్నదే కల్కి అని తేల్చి చెప్పాడు. చివరలో ప్రభాస్ ను కర్ణుడిగా చూపించి అందరికీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. అసలు కల్కి ఎవరు.. అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ప్రభాస్ కర్ణుడిగా ఎందుకు నటించాడు.. హీరో అయిన కల్కి పాత్రలో ఎందుకు నటించలేదనే టెన్షన్ చాలా మందిలో ఉంది.
అయితే సినిమాలో జాగ్రత్తగా గమనిస్తే.. కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడి పాత్రల్లో ముఖాలను చూపించాడు నాగ్ అశ్విన్. కానీ ఒక్క కృష్ణుడి ముఖాన్ని మాత్రం దాచి పెట్టాడు. కృష్ణుడిని వెనక భాగం నుంచి చూపించాడు తప్ప.. ముందు భాగం నుంచి చూపించలేదు. పురాణాల కథ ప్రకారం.. కృష్ణుడు శ్రీ కృష్ణుడి అవతారం. ఈ అవతారం తర్వాతనే కల్కి అవతారం వస్తుంది. అంటే అదే శ్రీ కృష్ణుడి అవతారంలో ఉన్న వారే కల్కి అవతారంలో కూడా కనిపిస్తారన్న మాట. మరి ప్రభాస్ ను కాదని.. కల్కిగా వేరే వారిని చూపించేందుకు నాగ్ అశ్విన్ ఇలా ముఖాన్ని దాచిపెట్టాడా అనే సందేహాలు వస్తున్నాయి.
అలా చేస్తే ప్రభాస్ పాత్ర బలహీనం అవుతుంది. ఇప్పటికే కల్కి సినిమా చూసిన వారు.. ప్రభాస్ పాత్ర కంటే అశ్వత్థామ పాత్ర బలంగా పవర్ ఫుల్ గా ఉందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కౌరవుల తరఫున పోరాడిన కర్ణుడిగా ప్రభాస్ ను చూపించి.. దేవుడి అవతారం అయిన కల్కిగా వేరే వారిని చూపిస్తే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు.
మరి అలా కాదని.. కృష్ణుడి పాత్రను కల్కి సినిమాలో తగ్గించి.. కర్ణుడిగా ఉన్న ప్రభాస్ పాత్రకు మరిన్ని సీన్లు రాసి.. ఆ పాత్ర చుట్టూ కథను కొత్తగా నడిపిస్తాడా అనేది కూడా సందేహమే. కల్కి సినిమా మొదటి పార్టును జాగ్రత్తగా గమనిస్తే.. పురాణాల కథలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా.. కొంత ఊహాతీతంగా తీయాలని నాగ్ అశ్విన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. మరి సెకండ్ పార్టులో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి.
