Kalki Movie : మరోసారి రాముడిగా ప్రభాస్.. మూడు భాగాలుగా కల్కి మూవీ..?

Qubetvnews - February 17, 2024 / 11:15 AM IST

Kalki Movie : మరోసారి రాముడిగా ప్రభాస్.. మూడు భాగాలుగా కల్కి మూవీ..?

Kalki Movie :

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ మూవీ కల్కి2898ఏడీ. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అప్పట్లో బాహుబలి మీద ఎలాంటి అంచనాలు ఉండేవో ఇప్పుడు అంతకు మించి అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. గతంలో ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు. పైగా ప్రభాస్ ఇందులో నటిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఐదారు వందల కోట్లతో ఈ మూవీని తీస్తున్నారు. ప్రభాస్ తో పాటు చాలా మంది బడా స్టార్లు ఇందులో కనిపిస్తున్నారు.

దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ లాంటి స్టార్లు మొత్తం ఇందులో కనిపించబోతున్నారు. దాంతో ఈ మూవీపి అన్ని భాషల్లోన అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ మూవీని ఇన్ని రోజులు రెండు పార్టులుగా తెరకెక్కిస్తామని అనుకున్నారు. కానీ ఈ మూవీ కథ డిమాండ్ మేరకు మూడు పార్టులుగా తీయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారంట. బడ్జెట్ రికవరీ కోసం కూడా కలిసి వస్తుందని నాగ్ అశ్విన్ ఇలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కల్కి మూడు పార్టులకు సంబంధించిన టైటిల్స్ కూడా రివీల్ అయ్యాయి. కల్కి2898ఏడీ(కల్కి1)ని ఈ మే 9న విడుదల చేయబోతున్నారు. ఇక కల్కి3102బీసీ(కల్కి2) తోపాటు కల్కి3228బీసీ(కల్కి 3)గా టైటిల్స్ ఫిక్స్ చేశారట. అన్నీ కుదిరితే రెండో పార్ట్ ను 2027లో ప్లాన్‌ చేస్తున్నారట. 2029 లేదా 30లో మూడో భాగం ఉండే అవకాశాలున్నాయి. అయితే ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఫ్యూచర్ నుంచి చరిత్రలోకి వెళ్తారని తెలుస్తోంది. మైథలాజికల్ ఎలిమెట్లు ఉంటాయని అంటున్నారు. మైథలాజికల్ సీన్లు వచ్చినప్పుడు ప్రభాస్ వివిధ దేవుళ్ల రూపాల్లో కనిపిస్తాడంట.

Kalki Movie Planned Be Made Into Three Parts

Kalki Movie Planned Be Made Into Three Parts

అయితే మైథలాజికల్ మూమెంట్ వచ్చినప్పుడు ప్రభాస్ రాముడిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు విష్ణుమూర్తిగా, కృష్ణుడిగా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. చివరగా కల్కి అవతారంలో కనిపిస్తాడని అంటున్నారు. ఇలా మొత్తం నాలుగు అవతారాల్లో కనిపిస్తాడని చెబుతున్నారు.

ఈ కథను పురాణాలతో ముడిపెట్టి నాగ్ అశ్విన్ తీస్తున్నాడని అంటున్నారు. మొత్తం 27 భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారంట. హిందూ పురాణాల ప్రకారమే ఈ సినిమాను మైథలాజికల్ గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉదో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

Read Today's Latest Entertainment in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News