CM Revanth Reddy : బీఆర్ఎస్ కు కౌంటర్ వేసే పనిలో కాంగ్రెస్.. ప్లాన్ అదిరిందిగా..!
Qubetvnews - February 17, 2024 / 08:47 AM IST
CM Revanth Reddy :
బీఆర్ ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేసే పనిలో ఉంది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి పోరాటాలు చేయగలరో కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే ఆదిలోనే కేసీఆర్ ను కట్టడి చేయాలని కాంగ్రెస్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటోంది. రేవంత్ రెడ్డి చిన్న విషయంలో కూడా ఢీ అంటే ఢీ అన్నట్టే ఉంటారు. అంతే గానీ లైట్ తీసుకోరు. ఎందుకంటే లైట్ తీసుకుంటే అది పార్టీకి, ప్రభుత్వానికి నష్టం అని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో బీఆర్ ఎస్ కు కౌంటర్ వేయాలని అనుకుంటున్నారు.
బీఆర్ ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద బలమైన ఆరోపణలు చేస్తోంది. ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పటించాలని కాంగ్రెస్ చూస్తోందంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేస్తోంది. కృష్ణా నది ప్రాజెక్టులపై బీఆర్ ఎస్ ఇప్పటికే పోరు బాట పట్టేందుకు రెడీ అయిపోయింది. కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్ లో కృష్నానది పరివాహక ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సభలో కృష్నానది ప్రాజెక్టులపై తాము పోరాడిన విధానాలను, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతామని చెబుతున్నారు.
కనీసం మూడు లక్షల మందితో ఈ సభను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందని రేవంత్ రెడ్డి గ్రహించారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ సభకు కౌంటర్ సభ పెట్టాలని డిసైడ్ అయ్యారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కనీసం రెండు లక్షల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సభలోనే గతంలో కేసీఆర్ కేఆర్ ఎంబీకి పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Decided Hold Huge Public Meeting In Nalgonda
అంతే కాకుండా కృష్నానదిపై ఆంధ్రా పాలకులు దోపిడీ చేస్తున్నా సరే కేసీఆర్ మౌనంగా ఉండటాన్ని వివరించబోతున్నారంట. ఏపీ పాలకులు ఎప్పుడెప్పుడు నీటి దోపిడీకి పాల్పడ్డారనేది కూడా ఇందులో చెప్పబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇదే సభలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పై ప్రకటన చేయబోతున్నారంట.
బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి వీటిపై అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. అంతే కాకుండా దానిపై బహిరంగ సభ లో అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి బీఆర్ ఎస్ సభలకు కౌంటర్ వేసేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడ బాగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.





