CM Revanth Reddy : మహిళా ఓటర్లను లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Qubetvnews - February 17, 2024 / 10:50 AM IST

CM Revanth Reddy : మహిళా ఓటర్లను లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

CM Revanth Reddy :

రేవంత్ రెడ్డి చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏదైనా పని అనుకుంటే దానికి తగ్గట్టుగా ముందస్తు ప్లాన్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల కోసం ఇలాంటి పనులే చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసింది. అందుకోసం మహిళలకు ప్రత్యేక స్కీములు కూడా పెట్టింది. మహిళా ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తే వారిని ఆకర్షించడం పెద్ద కష్టమేం కాదని రేవంత్ కు బాగా తెలుసు.

అందుకే వారి కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని పెట్టారు. దాంతో పాటు మహాలక్ష్మీ పథకం కింద ఆడవారికి రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని కూడా తెలియజేసింది. ఈ స్కీములన్నీ కూడా మహిళా ఓటర్లను టార్గెట్ చేసేలాగానే ఉన్నాయి. వాస్తవానికి కిచెన్ లో వాడే గ్యాస్ సిలిండర్ తక్కువకు ఇస్తే అది కచ్చితంగా మహిళా ఓటర్లను ఆకర్శిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంతో పాటు ఉచిత కరెంట్ అనేది కూడా మహిళా ఓటర్లను టార్గెట్ చేసినట్టే ఉంటుంది.

అంటే ఇంటికి సంబంధించి ఏది ఉచితంగా ఇచ్చినా లేదంటే స్కీమ్ పెట్టినా సరే అది కచ్చితంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తుంది. ఈ విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వారిని బలంగా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు కూడా మరోసారి మహిళా ఓటర్లను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎంపీ ఎన్నికల్లోపు గ్యాస్ రూ.500లకే సిలిండర్ దాంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆ రెండు స్కీములపై రివ్యూలు కూడా చేశారు.

త్వరలోనే వాటిని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. మగవారికి సంబంధించిన స్కీములు పెట్టినా గంపగుత్తగా ఓట్లు పడుతాయనే నమ్మకం లేదు. అదే ఆడవారికి సంబంధించిన వి పెడితే మాత్రం కచ్చితంగా వారి ఓట్లు గంపగుత్తగా పడుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు గంపగుత్తగా మహిళల ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు మేలు చేసే అంశమే అంటున్నారు రాజకీయ నిపుణులు. రేవంత్ పనితీరును ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News