Pawan Kalyan : రూ.5లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్.. ఎందుకో తెలుసా..?

Qubetvnews - January 12, 2025 / 10:20 AM IST

Pawan Kalyan : రూ.5లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్.. ఎందుకో తెలుసా..?

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ ఏం చేసినా సెన్సేషనే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన పోస్టులతోనే సోషల్ మీడియా నిండిపోతోంది. ఆయన వీడియోలతోనే యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సరిపోతోంది. కొన్ని సార్లు ఏం మాట్లాడకపోయినా సరే దాని గురించి పెద్ద చర్చనే జరుగుతుంది. అలాంటి పవన్ కల్యాణ్‌ తాజాగా చేసిన పని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ పుస్తక ఉత్సవాన్ని సమన్వయ కర్త ఎమెస్కో విజయ్ కుమార్, అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి మనోహర్ నాయుడు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఆ పుస్తక ఉత్సవాన్ని సందర్శించారు.

వాస్తవానికి మధ్యాహ్నం తర్వాత ఈ పుస్తక ఉత్సవం ఓపెన్ అవుతుంది. కానీ పవన్ కల్యాణ్‌ కోసం ఉయదాన్నే తెరిచారు. పవన్ ఈ స్టాళ్లలో దాదాపు రెండున్నర గంటల సేపు తిరిగారు. అన్ని పుస్తకాలను పరిశీలించారు. రూ.5లక్షల రూపాయల విలువైన పుస్తకాలను టక్ మని కొనేశారు. అవును ఒకటి కాదు రెండు.. ఏకంగా రూ.5లక్షల విలువైన పుస్తకాలను కొన్నారు. ఇందులో కొన్నింటిని పిఠాపురంలో తాను పెట్టబోయే గ్రంథాలయంలో పెట్టబోతున్నారు పవన్. ఇంకొన్ని రాష్ట్రంలోని ఇతర గ్రంథాలయాల్లో, స్కూళ్లు, కాలేజీల్లో పెట్టబోతున్నారు. ప్రత్యేకంగా డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాక్ల్ రాసిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకాన్ని చూసి ఇది తనకు ఎంతో ఇష్టమైన పుస్తకం అని చెప్పారు పవన్.

ఆ బుక్ చదివితే ప్రతి మనిషి తన నిరాశను వదిలి ఉత్సాహంగా ముందుకు వెళ్తాడంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ రచయిత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల నిర్భందంలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాడని పవన్ వివరింగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఓ పుస్తకం ఎవరు రాశారో.. ఎప్పుడు రాశారో కూడా గుర్తుపెట్టుకోవడం అంటే మాటలు కాదు. దీన్ని బట్టి పవన్ పుస్తకాలను ఎంతగా ఇష్టపడి చదువుతారో అర్థం అవుతుంది అంటున్నారు జనసైనికులు. పవన్ కల్యాణ్‌ పుస్తకాలను ఎక్కువగా చదువుతారు అనే విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది చెప్పుకొచ్చారు.

పవన్ కూడా తాను పుస్తకాలు చదివి ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని తన చేతల్లో చూపిస్తున్నారు అని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News