Vega Jewellers : కాకినాడలో బాలకృష్ణ సందడి.. వేగ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ప్రారంభం..!
Qubetvnews - December 6, 2024 / 12:52 PM IST
Vega Jewellers : కాకినాడ పట్టణంలోని బాలాజీచెరువు సెంటర్ లో వేగ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. దీన్ని టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్ తో కలిసి ప్రారంభించారు. ఇది వేగ జ్యువెలర్స్ కు నాలుగో షోరూం. షోరూం ప్రారంభం సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడారు.

Vega Jewellers new branch opening in kakinada
నాకు వేగ జ్యువెలర్స్ తో ఎంతో అనుబంధం ఉంది. మహిళలకు కావాల్సిన అన్ని రకాల నగలు ఒకేచోట దొరికేది వేగ జ్యువెలర్స్ లోనే అన్నారు. బర్త్ డే పార్టీల నుంచి అమ్మాయిల పెళ్లిళ్ల వరకు అన్ని రకాల బంగారు ఆభరణాలు ఇక్కడ దొరుకుతాయన్నారు.
ఇక సంస్థ యజమానులు వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ ఏండ్లుగా తమ సంస్థ ఏపీ, తెలంగాణ ప్రజలకు నాణ్యమైన బంగారు ఆభరణాలను తక్కువ ధరకే అందిస్తున్నట్టు చెప్పారు. నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆదరణ పెంచుకుంటున్నామన్నారు. ఈ నెల 12 దాకా బంగారు నగలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు.

Vega Jewellers new branch opening in kakinada
ప్రతి ఆభరణం మీద 4.99 శాతం నుంచి 11.99 శాతం వరకు తరుగు ఉంటుందని.. బీఐఎస్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలు దొరుకుతాయన్నారు. అలాగే డైమండ్ క్యారట్ ధర కేవలం రూ.50999 మాత్రమే నని చెప్పారు. సంస్థలో అన్ని రకాల ఆభరణాలను కావాల్సిన డిజైన్లలో అందిస్తున్నట్టు వెల్లడించారు.





