Allu Arjun: శ్రీతేజ్ భవిష్యత్ కు బన్నీ భరోసా.. ఇది కదా బాధ్యత అంటే..!
Qubetvnews - January 8, 2025 / 12:29 PM IST
Allu Arjun: అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అందులో బన్నీ ప్రమేయం ఏమీ లేకపోయినా సరే అతన్ని ఎంతో మంది టార్గెట్ చేశారు. కావాలనే కారుకూతలు కూశారు. ఎలాగైనా బన్నీ ఇమేజ్ ను దెబ్బ తీయాలనుకున్నారు. దేశం ముందు అతన్ని ఓ దోషిగా నిలబెట్టేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ అల్లు అర్జున్ ఎక్కడా తడబడలేదు. కేవలం న్యాయ పరంగానే పోరాడాడు. చివరకు తన తప్పు లేదని కోర్టులోనే మెప్పించి మరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఒకవైపు అల్లరి మూకల నోర్లు మూయిస్తూనే మరోవైపు తన అభిమాని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ వైద్య ఖర్చులు భరిస్తున్నాడు అల్లు అర్జున్.
అంతటితో ఆగిపోకుండా శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయాన్ని కూడా చేశాడు. ఇంత చేసినా సరే బన్నీకి మాత్రం తన అభిమాని శ్రీతేజ్ ను కలవాలని మొదటి నుంచి ఆరాటం ఉంది. అందుకు అతను చేయని ప్రయత్నం లేదు. కానీ పోలీసుల నుంచి ఆంక్షలు ఉండటంతో తాను కలవలేకపోయినా.. తన టీమ్ ను ఆస్పత్రిలోనే ఉంచి ఎప్పటికప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. చివరకు పట్టువదలని విక్రమార్కుడిలా
బన్నీ చేసిన ప్రయత్నాలకు శ్రీతేజ్ ను కలిసేందుకు పోలీసులే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో బన్నీ దిల్ రాజుతో కలిసి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి తన కొడుకుతో సమానం అయిన బాబును పరామర్శించాడు.
బాబు భవితవ్యానికి పూర్తి భరోసానిచ్చాడు. శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని.. అందుకు ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఆస్పత్రి డాక్టర్లతో అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఇక తన అభిమాన హీరో బన్నీని చూడటంతో శ్రీతేజ్ కూడా కాస్త ఉత్సాహంతో ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాబుతో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీతేజ్ కు తాను ఉన్నాననే భరోసా ఇస్తే త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని బన్నీ తాపత్రయ పడ్డాడు.
శ్రీతేజ్ కు ఏమేం కావాలో అన్నీ ఏర్పాటు చేయాలంటూ అక్కడే ఉన్న తన టీమ్ ను ఆదేశించాడు. డాక్టర్లు కూడా బన్నీ చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయారు. ఇంత బాధ్యతగా వ్యవహరించడాన్ని చూసి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ తానెంత బాధ్యతగా ఉన్నాననేది ఈ ఘటనతో మరోసారి నిరూపించుకున్నాడని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.





