Allu Arjun : అల్లు అర్జున్ కెరీర్ లో 2024.. ఓ పెద్ద సక్సెస్.. ఓ ఇష్యూ..!
Qubetvnews - December 24, 2024 / 12:51 PM IST
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంటైర్ కెరీర్ లోనే 2024 అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే బన్నీ 20 ఏళ్లు ఏ స్థాయి కోసం కష్టపడ్డాడో.. ఏ సక్సెస్ ను చూడటం కోసం ఆరాటపడ్డాడో అది ఈ ఏడు దక్కింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో నిలిచిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ ను నిలబెట్టింది. ఈ సినిమాతో కేవలం పాన్ ఇండియా హీరోగానే కాకుండా.. బిగ్గెస్ట్ ఇండియన్ స్టార్ గా మారాడు. నార్త్ లో ఏ సౌత్ హీరోకు సాధ్యం కాని ఫాలోయింగ్ ను కూడా పెంచేసుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ దేశ వ్యాప్తం అయ్యాయి.
కానీ అదే సమయంలో బన్నీ లైఫ్ లో మర్చిపోలేని వివాదం కూడా చుట్టుముట్టింది. అల్లు అర్జున్ ఎన్నడూ వివాదాల జోలికి పోలేదు. కానీ మొదటిసారి సంధ్య థియేటర్ ఘటనతో ఏకంగా జైలుకు కూడా వెళ్లాడు. అంతే కాకుండా ఇది కాస్త దేశ వ్యాప్తంగా చాలా పెద్ద వివాదంగా మారిపోయింది. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించట్లేదు. అంత పెద్ద స్టార్ హీరో ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంతో అందరి చూపు అటువైపే ఉంది. కాగా అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే ఈ వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఈ ఏడాది బన్నీకి ఎంత కలిసి వచ్చిందో.. అంతే వివాదాన్ని కూడా తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి.
సాధారణంగా బన్నీ ఎన్నడూ రాజకీయాల జోలికి వెళ్లడు. సినిమా తప్ప వేరే విషయం గురించి కూడా మాట్లాడడు. కానీ మొట్టమొదటిసారి అతను రాజకీయ పరమైన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద సక్సెస్ ను చూసిన ఆనందాన్ని ఈ వివాదం లాగేసిందనే చెప్పుకోవాలి. ఇన్నేళ్లు ఏ పొజీషన్ కోసం అహోరాత్రులు కష్టపడ్దాడో.. అది వచ్చింది. కానీ ఆ సంతోషం మాత్రం లేదు. అతను చేసిన ప్రతి సినిమాలో, ప్రతి పాత్రలో అతని కష్టం మనకు కనిపిస్తుంది. ఆ కష్టం ఇచ్చిన సక్సెస్ వెంటే.. ఓ ఇష్యూ కూడా రావడంతో అల్లు అర్జున్ కు ఈ ఏడాది ఓ విషాదంగానే మిగిలిపోతోంది.
తాను కావాలని చేసిన తప్పు కాకపోయినా బన్నీని ఓ పెద్ద వివాదం చుట్టు ముట్టేసింది. ఈ వివాదం నుంచి అతను ఎలా బయటపడుతాడో అనేది ఎదురు చూడాల్సిందే. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్ లో ఒక్క వివాదం గానీ చిన్న గొడవ గానీ లేదు. మరి ఇప్పుడు ఈ వివాదంతో అతను మున్ముందు ఎలా ఉంటాడనేది ఎదురు చూడాలి.





