Daaku Maharaaj Movie Review : డాకు మహారాజ్ మూవీ రివ్యూ.. హిట్టా, ఫట్టా..?
Qubetvnews - January 12, 2025 / 10:05 AM IST
Daaku Maharaaj Movie Review : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా డాకు మహారాజ్. బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. నిర్మాత నాగవంశీ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు నటించారు. ఈ సినిమా నేడు థియేటర్లోలకి వచ్చింది. మరి బాలయ్య అభిమానుల అంచనాలను నిజం చేసిందా లేదా నిరాశపరిచిందా అనేది తెలుసుకుందాం.
కథ ఏంటంటే..?
సివిల్ ఇంజనీర్ గా పనిచేసే సీతారాం(బాలయ్య) అన్యాయాన్ని ఎదిరించే డాకుగా మారుతాడు. మధ్య ప్రదేశ్ ప్రాంతంలో జరిగే అన్యాయాలను అతను ఎదిరిస్తూ ఉంటాడు. దాంతో అక్కడి ప్రజలు అతన్ని డాకు మహారాజ్ గా కీర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తి వైష్ణవి అనే చిన్న పాప కోసం ఆంధ్రాకి వస్తాడు. అసలు డాకు ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు.. ఇంతకీ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు, ఆమెను కాపాడటం కోసం అతను ఏం చేశాడు, డాకు మహారాజ్ గతం ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
బాలయ్య చాలా కాలం తర్వాత ఓ కొత్త రకమైన పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు మాస్ యాంగిల్ ఉండే పాత్రలే ఆయన ఎక్కువగా చేశాడు. కానీ ఇందులో డాకు మహారాజ్ గా ఆయన కొత్త ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ బాబీ రాసుకున్న కథలో చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఆయన తెరకెక్కించిన విధానం బాగుంది. కథ ఎంత రొటీన్ గా ఉన్నా సరే దాన్ని తెరకెక్కించే విధానంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. ఈ విషయంలో బాబీ మార్కులు కొట్టేశాడనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఎమోషన్ సీన్లు అతిపెద్ద బలం. దానికి తోడు యాక్షన్ సీన్లను కూడా సమానంగానే రాసుకున్నాడు బాబీ. కోర్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్ సీన్ల సమయంలో వచ్చే బీజీఎం హత్తుకునేలా ఉంది. బాలయ్య చాలా సీన్లలో కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. ఆయన చెప్పే డైలాగులు, ఫైట్ సీన్లు కొత్తగా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే విజిల్ వేయించేలాగానే ఉంది. కాకపోతే కొన్ని సీన్లు పరమ రొటీన్ గా అనిపిస్తాయి. ఇలాంటి సీన్ లు చాలా సినిమాల్లో చూశాం కదా అనే ఫీలింగ్ కలిగినా.. వెంటనే కథలో వేగం పెంచడం వల్ల ప్రేక్షకులు అటెన్షన్ లోకి వచ్చేస్తారు. బాలయ్య పాత్ర చుట్టూనే మేజర్ కథ సాగుతుంది. ఆయన పాత్ర తర్వాత ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాధ్ ల పాత్రలు కూడా మెప్పిస్తాయి. బాబీ డియోల్ పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. బలమైన హీరో పాత్రకు అంతకంటే బలమైన విలన్ పాత్ర ఉంటేనే సీన్ పండుతుంది. ఈ విషయంలో బాబీ సక్సెస్ అయ్యాడు. అందుకే బాలయ్య, బాబీ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి.
ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్..
ఈ సినిమాను బాలయ్య వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవాలి. బాలయ్య మరోసారి ఇందులో మెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఆయన నటన బాగుంది. ఓ వైపు తన రౌద్ర రూపాన్ని చూపిస్తూనే.. మరోవైపు ఎమోషన్ సీన్లతో కట్టి పడేస్తాడు. అందుకే ఇది బాలయ్య నటనను చూపించే సినిమాగానే చెప్పుకోవాలి. ఇక బాబీ డియోల్ తన పాత్రకు తగ్గట్టు విలనిజాన్ని చూపించాడు. హీరోయిన్స్ గా చేసిన ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ పాత్రలు చాలా లిమిటెడ్ గా ఉన్నప్పటికి ఉన్నంత సేపు వాళ్లు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే..?
డైరెక్టర్ బాబి ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు. నాలుగైదు సినిమాలను కలిపేసి ఓ సినిమాగా చేసేసి నెట్టుకొస్తున్నాడు అనే అపవాదును ఈ సినిమాను చాలా వరకు చెరిపేశాడు అనే చెప్పుకోవాలి. కథ సాదాసీదాగానే ఉన్నా.. ఆయన తెరకెక్కించిన విధానానికే మార్కులు పడుతాయి. ఎమోషన్, యాక్షన్ రెండింటి మీదనే కథనం నడిపించాడు. టేకింగ్, విజువల్స్, పాటలు ఇవన్నీ కలిపి ఓవరాల్ గా ఓకే అనిపించుకున్నాడు. తమన్ అందించిన మ్యూజిక్ కంటే బీజీఎంకే ఎక్కువ కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. ఫోటోగ్రఫీ కూడా చాలావరకు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. ప్రతి షాట్ ని ఫ్రెష్ గా చూపించారు. నిర్మాత నాగవంశీ పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్
బాలయ్య నటన
బాబిడియోల్ విలనిజం
బాబి డైరెక్షన్
మైనస్ పాయింట్లు
రొటీన్ గా అనిపించే కథ
ఆకట్టుకోని పాటలు
చివరగా..
డాకు మహారాజ్ తో బాలయ్య నటన పరంగా మార్కులు కొట్టేస్తే.. డైరెక్టర్ టేకింగ్ పరంగా మార్కులు కొట్టేస్తాడు. ఇద్దరికీ ఈ సినిమా ఓ హిట్ ఇచ్చేసింది.
రేటింగ్ః2.5/5





