Tolluwood : టాలీవుడ్ లో ఇక ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల వార్ ఉండదా..?

Qubetvnews - January 26, 2025 / 11:23 AM IST

Tolluwood :  టాలీవుడ్ లో ఇక ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల వార్ ఉండదా..?

Tolluwood : ఇప్పుడు టాలీవుడ్ లో కలెక్షన్ల వార్ బాగా నడుస్తోంది. మా హీరో సినిమాకు ఇంత కలెక్షన్లు వచ్చాయంటే.. మా హీరో సినిమాకు ఇన్ని కలెక్షన్లు వచ్చాయంటూ పోస్టర్లు వదలాల్సిందే. లేదంటే సదరు హీరోల అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ సంతృప్తి కోసమో లేదంటే సదరు హీరో ఇమేజ్ కోసమో ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సార్లు నిజంగానే సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే.. ఆ పోస్టర్లలో వేసిన కలెక్షన్లు నిజమైనా సరే ప్రేక్షకులు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరీ ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు ఎక్కువ అవుతున్నాయని స్వయంగా దిల్ రాజు కూడా ఒప్పుకున్నారు.

సినిమాల కలెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పోస్టర్లలో చూపించుకోవడంతోనే ఈ నడుమ వరుసగా టాలీవుడ్ నిర్మాతల ఇండ్ల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. మొన్న దిల్ రాజు ఇంట్లో, మైత్రీ మూవీ మేకర్స్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఫేక్ కలెక్షన్ల వల్లే ఐటీ దాడులు జరుగుతున్నాయా అని ఓ రిపోర్టర్ అడగ్గా.. ఫేక్ కలెక్షన్లు వేసుకోవడం తప్పే అని దిల్ రాజు కూడా ఒప్పుకున్నారు. దీనిపై త్వరలోనే టాలీవుడ్ నిర్మాతలందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసుకుంటే హీరోలకు ఇమేజ్ పెరుగుతుంది కానీ.. నిర్మాతలకు మాత్రం ఐటీ చిక్కులు వస్తున్నాయనేది వాస్తవం.

అందుకే ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈ విషయంలో చర్చిస్తామని చెప్పారు. ఈ నడుమ టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతల అందరి ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. దానికి కారణం ఏంటనేది కూడా అందరికీ తెలిసిందే. అందుకే నిర్మాతలు తమకు ఇబ్బందులు రావొద్దంటే ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల వార్ ను ఆపేయాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవ కలెక్షన్లకు దగ్గరగా పోస్టర్లు వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్మాతలు భావిస్తున్నారంట. పైగా ఇప్పుడు 90 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే బుక్ అవుతున్నాయి. కాబట్టి ఫేక్ కలెక్షన్లు వేసుకుని చిక్కుల్లో పడటం ఎందుకు అనేది నిర్మాతల భావన.

ఐటీ దాడులు చేసినప్పుడు అసలు కలెక్షన్లు ఎంతో కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ కలెక్షన్లు వేసుకుని ఐటీ దాడుల్లో మళ్లీ వర్జినల్ లెక్కలు చెప్పే బదులు.. ముందే సరైన కలెక్షన్ల పోస్టర్లు వేసుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారంట. కాబట్టి హీరోల కోసం తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవద్దని నిర్మాతల మండలి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News