Nara Devaansh : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు..!

Qubetvnews - December 23, 2024 / 10:50 AM IST

Nara Devaansh : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు..!

Nara Devaansh : నారా వారి మూడో తరం వారసుడు దేవాన్షన్ చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నాడు. మంత్రి లోకేష్ కొడుకు దేవాన్షన్ చెస్ లో వేగంగా పావులు కదపడటంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మామూలుగా చెస్ లో బాగా రాటు దేలాలంటే కొంత వయసు ఉండాలి. కానీ దేవాన్ష్ వయసు కేవలం 9 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అతను “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” లో ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అఫీషియల్ గా ధృవీకరణ పత్రాలను పొందాడు. దీంతో నారా వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.

nara lokeshs son devaansh sets world record in chess

nara lokeshs son devaansh sets world record in chess

దేవాన్ష్ చిన్నప్పటి నుంచే చెస్ లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఆటలో అతను ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో “చెక్‌మేట్ మారథాన్” గా పేరు సంపాదించుకున్నాడు. అతను ఈ రికార్డులో చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని అత్యంత వేగంగా సక్సెస్ ఫుల్ గా పరిష్కరించాడు. చాలా ప్రఖ్యాతి చెందిన చెస్ సంకలనం నుంచి సెలెక్ట్ చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందిస్తారు. దీంతో పాటు దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా అందుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమి 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు.

nara lokeshs son devaansh sets world record in chess

nara lokeshs son devaansh sets world record in chess

ఈ రికార్డుల్లో అతను 32 పీస్ లను వేగవంతంగా సరైన స్థానాల్లో అమర్చి అబ్బురపరిచాడు. అతని రికార్డును న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అతని ప్రతిభను ప్రశంసించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. దేవాన్ష్ ప్రతిభను చిన్నప్పటి నుంచే గుర్తించి శిక్షణ ఇప్పించామని తెలిపారు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. ఈ చెస్ అకాడమిలో దేవాన్ష్ రోజుకు 5 నుంచి 6గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. దేవాన్ష్ కు చెస్ గురువు అయిన కె. రాజశేఖర్ రెడ్డి కూడా ఆనందం వ్యక్తం చేశారు.

దేవాన్ష్ ఏ పని అయినా ఎంతో ఓపికగా చాలా త్వరగా నేర్చుకుంటాడని.. అతను ఒక డైనమిక్ విద్యార్థి అంటూ కితాబిచ్చాడు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని చాలా త్వరగా క్లియర్ చేస్తాడని.. అతని ప్రతిభ, చురుకుదనంతో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పాలంటూ అతను చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News