Nani And Sandeep Redd Vanga : నాని, సందీప్ రెడ్డి మీటింగ్.. భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారా..?
Qubetvnews - February 17, 2024 / 07:39 AM IST
Nani And Sandeep Redd Vanga :
ఇప్పుడు సినిమా ప్రపంచంలో గట్టిగా వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. ఈయన చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను ఊచకోత కోసేశాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మాత్రం ట్రెండ్ సెట్టర్ లుగా నిలిచిపోయాయి. అసలు సినిమా అంటే ఇలాగే తీయాలి అనే రూల్స్ పెట్టుకోకుండా.. నా ఇష్టం ఎలాగైనా సినిమా తీస్తాను అంటూ రూల్స్ బ్రేక్ చేసి సినిమాలు తీస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆయన చేసిన అర్జున్ రెడ్డి మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పట్లో అదో ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాను మిగతా భాషల్లో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దాని తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని చేసిన సినిమా యానిమల్. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. దాంతో మరోసారి సందీప్ పేరు సెన్సేషనల్ అయిపోయింది. ఇక దాని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమాకు ఇప్పటికే కమిట్ అయ్యాడు. దాంతో పాటు అల్లు అర్జున్ కూడా సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఇక సందీప్ తో సినిమా చేసేందుకు చాలా మంది చాలా మంది స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సందీప్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా.. ఇంకా ఏ హీరోతో కమిట్ అవుతాడా అని ఇలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు సంబంధించిన ఫొటో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, సందీప్ వంగ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనపించారు. తాజాగా వీరిద్దరూ ఇలా ఎయిర్ పోర్టులో కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ కలిసి ఏ సినిమాకు అయినా ప్లాన్ చేస్తున్నారేమో అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.

Photos Of Nani And Sandeep Redd Vanga Together At Airport Going Viral
వీరిద్దరూ హాయ్ నాన్న, యానిమల్ సినిమా కోసం ప్రమోషన్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ సన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు కూడా ఓకే చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పునడు వాటికి బలం చేకూర్చేలా ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు.
అయితే ఇద్దరూ చెన్నైలో జరిగే బిహైండ్ వుడ్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్తున్నట్టు కొందరు చెబుతున్నారు. ఆ ప్రోగ్రామ్ కోసమే ఇద్దరూ ఇలా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే సినిమా అనౌన్స్ చేస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే.





