Tollywood : మోహన్ బాబు, అల్లు అర్జున్.. ఇప్పుడు ఎన్టీఆర్.. అసలేం జరుగుతోంది..?

Qubetvnews - December 24, 2024 / 01:18 PM IST

Tollywood : మోహన్ బాబు, అల్లు అర్జున్.. ఇప్పుడు ఎన్టీఆర్.. అసలేం జరుగుతోంది..?

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది జరిగినన్ని వివాదాలు మునుపెన్నడూ జరగలేదనే చెప్పుకోవాలి. ఏకంగా పెద్ద స్టార్ల కుటుంబాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ఏడాదిలో అతిపెద్ద వివాదాలుగా మోహన్ బాబు, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ మిగిలాయి. ముందుగా మంచు కుటంబంలో చిచ్చు రేగింది. మంచు మనోజ్ దాడికి గురి కావడంతో పాటు తన తండ్రి మీదనే కేసు పెట్టాడు. దీంతో అది పెద్ద సంచలనమే రేపింది. అక్కడితో ఆ వివాదం ఆగిపోలేదు. మంచు మోహన్ బాబు కూడా మనోజ్ మీద అతని భార్య మీద కేసు పెట్టాడు. ప్రాణభయం ఉందంటూ చెప్పాడు. ఇంకోవైపు విష్ణు మీదకూడా కేసు నమోదయింది.

ఆ తర్వాత మీడియా వాళ్లు మనోజ్ తో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడం మోహన్ బాబు మైక్ తో రిపోర్టర్ ను కొట్టడం పెద్ద దుమారమే రేపింది. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఇదే ఒక ఎత్తు అయితే.. అల్లు అర్జున సంధ్య థియేటర్ ఎపిసోడ్ అయితే దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రేవతి చనిపోవడం ఆమె కొడుకు శ్రీ తేజ్ చావు బతుకుల్లో ఉండటంతో అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ వివాదం ఇంకా అయిపోలేదు. బన్నీ ఇంకా బయటపడలేదనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. బన్నీ మళ్లీ జైలుకు వెళ్తారా అనే ప్రశ్నలు కూడా వెంటాడుతున్నాయి.

ఇంకోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ ను కూడా వివాదంలో పడేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్ కు క్యాన్సర్ రావడంతో అతనితో గతంలోనే జూనియర్ వీడియో కాల్ మాట్లాడి ధైర్యం ఇచ్చాడు. తన ఫ్యాన్స్ తో పాటు టీటీడీ ద్వారా రూ.50 లక్షల దాకా సాయం అందించాడు. అయినా సరే ఇప్పుడు ఆ కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ రూ.20లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడని అవన్నీ ఇవ్వాలంటూ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేస్తోంది. దాంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. సెలబ్రిటీల ఇండ్లలో ఏది జరిగినా సరే దాన్ని అతిపెద్ద సమస్యగా చూపిస్తున్నారు.

వాళ్ల విషయంలో చిన్న ఘటన జరిగినా సరే దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు. సెలబ్రిటీలు కాబట్టి ఏం చూపించినా జనాలు చూపిస్తారనేది మీడియా, సోషల్ మీడియా ఆలోచన. అందుకే ఇలా ప్రతి దాన్ని పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. ఈ మూడు ఘటనల్లో ఎన్టీఆర్ ది చిన్న సమస్యనే కానీ బన్నీ, మోహన్ బాబు ఎలా బయట పడుతారో ఎదురు చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News