Payal Rajput : బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. పాయల్ రాజ్ పుత్ సంచలనం..!

Qubetvnews - May 20, 2024 / 09:44 AM IST

Payal Rajput : బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. పాయల్ రాజ్ పుత్ సంచలనం..!

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అంటే ఇప్పుడు ఓ సెన్సేషనల్. ఆమె చేసే సినిమాలు కూడా అలాగే ఉంటాయి మరి. మొదటి నుంచి ఆమె బోల్డ్ సినిమాలతోనే పేరు తెచ్చుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఆ సినిమాలో ఆమె లిప్ కిస్సులతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. దాంతో యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు అలాంటి బోల్డ్ సినిమాల్లోనే ఆఫర్ వచ్చింది. అయినా సరే ఆమె కాదనకుండా చేసింది.

ఇక ఆమె రీసెంట్ గా చేసిన మంగళవారం సినిమా ఓ సెన్సేషన్. ఇందులో ఆమె సెక్స్ పేషెంట్ గా చేసిన పర్ఫార్మెన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఆమె మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆమెకు వరుసగా పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె చేసిన ఓ పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఆమె తనను కొందరు బెదిరిస్తున్నారంటూ వాపోయింది. నేను 2019లో రక్షణ అనే సినిమాలో నటించాను. కానీ ఆ సినిమాను అప్పుడు రిలీజ్ చేయలేదు. నాకు ఎలాంటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా సక్సెస్ చూసి వాళ్లు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పుడు రిలీజ్ చేస్తే నా క్రేజ్ వల్ల సినిమా బాగా ఆడుతుందని భావిస్తున్నారు. అయితే నాకు అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా సినిమా ప్రమోషన్లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. రాను అంటే నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. రక్షణ సినిమాలో నా పేరు గానీ, నా పాత్రగానీ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ పోస్టు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు. రెమ్యునరేషన్ ఇవ్వకుండా బెదిరిస్తే ఊరుకునేది లేదని కామెంట్లు పెడుతున్నారు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక హీరోయిన్ ఇలాంటి పోస్టు నేరుగా పెట్టడం చాలా అరుదు. అయితే పాయల్ మాత్రం ఇప్పుడు ధైర్యం చేసింది. దాంతో పాయల్ కు మద్దతు పెరుగుతోంది. నీకు మేమున్నాం అంటూ ఆమెకు సినీ ఇండస్ట్రీలోని కొంత మంది అండగా నిలుస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News