Prabhas : ఎన్టీఆర్, చరణ్‌ బన్నీ.. ప్రభాస్ రికార్డును ఈ ఏడాదైనా బద్దలు కొడతారా..!

Qubetvnews - February 17, 2024 / 06:53 AM IST

Prabhas : ఎన్టీఆర్, చరణ్‌ బన్నీ.. ప్రభాస్ రికార్డును ఈ ఏడాదైనా బద్దలు కొడతారా..!

Prabhas :

ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతోంది. పైగా అన్ని సినిమాల బడ్జెట్ ఐదారు వందల కోట్లు అన్నట్టే ఉంటుంది. రీసెంట్ గానే సలార్ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. దాని తర్వాత మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దాని తర్వాత కూడా సలార్-2 సినిమా ఉంది. అంతే కాకుండా స్పిరిట్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాను కూడా చేస్తున్నాడు ప్రభాస్.

అయితే ప్రభాస్ పేరు మీద ఇప్పటికే చాలా రికార్డులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన బాహుబలి సినిమాతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసేశాడు. బాహుబలి-2 మూవీ రూ.1800 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి రికార్డును సృష్టించింది. ఇండియాలో అత్యధికంగా దంగల్ మూవీ వసూలు చేసి ఇప్పటికీ టాప్ పొజీషన్ లోనే ఉంది. అయితే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో చూసుకుంటే అమర్ ఖాన్, ప్రభాస్, యష్, షారుఖ్ ఉన్నారు. కాగా రామ్ చరణ్‌, ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఉంది.

కానీ మల్టీ స్టారర్ మూవీ. సింగిల్ గా వచ్చి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది టాలీవుడ్ నుంచి కేవలం ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు ప్రభాస్ తర్వాత రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఉన్నారు. కానీ వీరు సింగిల్ గా వచ్చి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరలేదు. కాగా ఇప్పుడు రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ మూవీతో రాబోతున్నాడు. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సంచలన దర్శకుడు శంకర్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా దేవర సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమాతో ఎలాగైనా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఎందుకంటే మొదటి పార్టు పెద్ద హిట్ అయింది. కానీ ఎందుకో వెయ్యి కోట్ల దాకా రాలేకపోయింది. ఇప్పుడు ఆయన పుష్ప-2 సినిమాతో ఎలాగైనా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని భావిస్తున్నాడు.

Only Prabhas From Tollywood Joined Thousand Crore Club

Only Prabhas From Tollywood Joined Thousand Crore Club

ఎన్టీఆర్ కూడా దేవర సినిమాతో వెయ్యి కోట్ల టార్గెట్ ను పెట్టుకుని పని చేస్తున్నాడు. అటు రామ్ చరణ్‌ కూడా అంతే. మరి ఇప్పటి వరకు సింగిల్ గా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరలేకపోయిన ఈ ముగ్గురు.. ఈ ఏడాదైనా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని ప్రయత్నిస్తున్నారు. మరి వారి ఆశలు నిజం అవుతాయా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News