Rashmika : రష్మికకు భారీ గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!
Qubetvnews - January 12, 2025 / 10:14 AM IST
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక అంటే దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా తాను నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తుంది. వందల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలకు ఆమె ఫస్ట్ ఆప్షన్. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరోయిన్ అభిమానులకు ఇప్పుడు ఓ భారీ బ్యాడ్ న్యూస్. అదేంటంటే రష్మికకు భారీ గాయాలు అయ్యాయి. కాలు ఫ్యాక్చర్ అయిపోయింది. అసలు కదల్లేని పొజీషన్ కు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. తన కాలికి గాయం అయిన విజువల్స్ మనకు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి.
దాంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు రష్మికకు ఏమైందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్మికకు జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆమె తెలిపింది. కొత్త సినిమాల కోసం కసరత్తులు చేస్తుండగా ఇలా జరిగినట్టు చెప్పింది రష్మిక. దీంతో తాను ఆస్పత్రిలో చేరినట్టు స్పష్టం చేసింది. తన కాలికి బలమైన గాయం అయిందని.. ఈ గాయం నుంచి కోలుకోవడానికి వారాలు పడుతుందో లేదంటే నెలలు పడుతుందో కూడా చెప్పలేనని ఆమె పోస్టులో తెలిపింది. తన అప్ కమింగ్ సినిమాల నిర్మాతలకు ఆమె సారీ కూడా చెప్పింది. ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనలేనంటూ తనకు రెస్ట్ కావాలంటూ కోరింది.
తనకు మళ్లీ సికిందర్, కుబేర సెట్స్ కు వెళ్లాలని ఉందంటూ ఆమె ట్వీట్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ వేలమంది కామెంట్లు పెడుతున్నారు. సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆమె కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గానే పుష్ప-2తో భారీ హిట్ అందుకుంది ఈ భామ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సినిమాలో కూడా మరోసారి యాక్ట్ చేస్తోంది. అటు పుష్ప-3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. వరుసగా భారీ సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామకు.. ఈ కాలిగాయం బ్రేక్ వేసింది. రష్మిక త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.





