Raviteja : హీరో రవితేజ ‘మాస్ జాతర’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. అదిరిపోయిందిగా..!
Qubetvnews - January 26, 2025 / 01:07 PM IST

Raviteja : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో 75వ ప్రతిష్టాత్మక సినిమాగా వస్తోంది మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మాస్ జాతర పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. పైగా చాలా రోజుల తర్వాత రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ గ్లింప్స్ లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అన్నట్టే ఉందని కామెంట్లు పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇందులో కూడా కామెడీకి యాక్షన్ ను జోడిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ లో మనదే ఇదంతా అనే డైలాగ్ రవితేజ చెప్పడం ఆకట్టుకుంది. ఈ డైలాగ్ కు చాలా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పైగా భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎం కూడా ఎనర్జిటిక్ గా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇక విజువల్స్ పరంగా కూడా మూవీ ఆకట్టుకుంటోంది.
కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలిపి ఈ మూవీని తీస్తున్నట్టు గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతోంది. మే9 న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీకి బడా టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. విధు అయ్యన్న కెమెరా మెన్ గా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.