MLC Kavitha : కవిత బాధితురాల.. నిందుతురాల..!?

Qubetvnews - February 24, 2024 / 10:09 AM IST

MLC Kavitha : కవిత బాధితురాల.. నిందుతురాల..!?

MLC Kavitha :

ఎంపీ ఎన్నికల ముంగిట కేసీఆర్ ఫ్యామిలీకి దారుణమైన దెబ్బ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయిన కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. అప్పట్లో ఢిల్లీ లిక్కర్ కేసు దేశాన్ని కుదిపేసింది. ఇందులో బడా బడా నేతల పేర్లు వినిపించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు, డిప్యూటీ సీఎం పేర్లు, కేసీఆర్ తనయ కవిత పేరు, ఏపీకి చెందని మాగుంట రాఘవరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. వీరితో పాటు ఇంకా కొంత మంది పేర్లు కూడా ఇందులో వినిపించాయి. దాంతో అప్పట్లో ఇది దేశాన్ని కుదిపేసింది.

కాగా ఈ కేసులో కవితను ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారించింది. రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి మరీ విచారించిన సీబీఐ.. ఒకసారి ఆమె ఇంటికి వచ్చి ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఈ కేసులో కవితను మొన్నటి వరకు సాక్షిగానే పరిగణించింది సీబీఐ. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కేసులో కవితను కేవలం సాక్షి కిందనే చూశారు అధికారులు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయిన వెంటనే ఇలా కవితను నిందితురాలిగా చేర్చడం చాలా వరకు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సీబీఐ చెబుతున్న కారణాలు కూడా ఉన్నాయి.

మాగుంట రాఘవరెడ్డి ఆరు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చినట్టు సీబీఐ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక కవిత పీఏ వాంగ్మూలం కూడా ఇందులో కీలకంగా ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే అసలు ఈ కేసులో కవిత నిందితురాలిగా ఉన్నారా.. లేదంటే బాధితురాలు అయ్యారా అనేది అర్థం కావట్లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ కవిత నిందుతురాలు అనుకుంటే.. ఇన్ని రోజులు సీబీఐ మౌనంగా ఉండదు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

CBI Included MLC Kavitha Accused

CBI Included MLC Kavitha Accused

కవితను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ.. అప్పుడు ఎందుకు ఆమె మీద చర్యలు తీసుకోలేదు.. అప్పుడెందుకు ఆమెను నిందితురాలిగా చేర్చలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బీజేపీకి బీఆర్ఎస్ కు సఖ్యత కుదరకనే జరిగాయన్నది కొందరి వాదనగా తెలుస్తోంది.

ఏదేమైనా బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన వెంటనే కవితను ఇలా నిందితురాలిగా చేర్చడం అనేది తెరవెనక రాజకీయం అని కొందరు అంటున్నారు. కానీ ఏ రాజకీయాలు అయినా సరే బలైపోయింది మాత్రం కవితనే అని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు, కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News