Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకునే పనిలో కాంగ్రెస్.. కలిసొచ్చేలా ఉందే..!

Qubetvnews - February 24, 2024 / 09:50 AM IST

Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకునే పనిలో కాంగ్రెస్.. కలిసొచ్చేలా ఉందే..!

Revanth Reddy  :

తెలంగాణ గడ్డ సెంటిమెంట్ అనేది చాలా పవర్ ఫుల్ వెపన్. ఇన్ని రోజులు దాన్ని బీఆర్ ఎస్ పదేండ్లుగా వాడుకుంది. అందుకే రెండు సార్లు అధికారంలోకి కూడా వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది తమపార్టీనే అనిచాలా సార్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. కానీ మూడోసారి అంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కాకుండా అభివృద్ధి మంత్రాన్ని జపించారు బీఆర్ ఎస్ నేతలు. దాంతో భారీ దెబ్బ పడిపోయింది. బీఆర్ ఎస్ మీద రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు బాగానే పని చేశాయి. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ను అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ హక్కులు, విధానాలు అనే అంశం వచ్చేసరికి దానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్ అనే అంశంలో ముందుగా గుర్తుకు వచ్చేది ఇప్పుడు నీళ్లు. నీటి పంపకాల విషయంలో తెలంగాణకు ఈ పదేండ్లుగా అన్యాయమే జరిగిందనే అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారు. దాంట్లో భాగంగానే మొన్న మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకు కేసీఆర్ హయాంలోనే జగన్ పోలీసులు పంపారని గుర్తు చేశారు.

అప్పుడు కేసీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని.. దీన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో జగన్ తెలంగాణ ప్రాజెక్టును ఆక్రమించారని.. అదే ఇప్పుడు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా.. తెలంగాణ ప్రాంతానికి నీళ్ల విషయంలో అన్యాయం చేసినా సరే తాను ఊరుకోబోనని.. కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఇలా నీళ్ల పంపకాల విషయంలో ఏపీకి వార్నింగ్ ఇవ్వడం వెనక పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది.

Revanth Reddy Said Injustice Telangana In Of Nagarjuna Sagar Dam

Revanth Reddy Said Injustice Telangana In Of Nagarjuna Sagar Dam

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీగా కాంగ్రెస్ ను వారు స్వీకరించాలన్నది ఆయన వ్యూహం. అలా చేస్తే రేపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆ తర్వాత కూడా ప్రజల్లో కాంగ్రెస్ మీద మంచి భావన ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు.

ఇందుకోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ బాగానే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. కాంగ్రెస్ ను ఒక జాతీయ పార్టీగా చూడకుండా.. తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకుంటే భవిష్యత్ లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News