MLC Kavitha : లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చిన సిబిఐ

Qubetvnews - February 23, 2024 / 06:36 PM IST

MLC Kavitha : లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చిన సిబిఐ

MLC Kavitha :

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈ కేసులో నిందితురాలుగా చేర్చింది సిబిఐ. దీంతో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ సిబిఐ విచారణకు ఈనెల 26న రావాలంటూ సిబిఐ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఎంపీ ఎన్నికల ముంగిట బిఆర్ఎస్ కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి.

ఇన్ని రోజులు ఈ లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత పలుమార్లు చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ వర్గాలు కూడా బిజెపి కుట్ర చేస్తుందంటూ ఆరోపించాయి. ఈ కేసులో కవితను ఇప్పటికే సిబిఐ పలుమార్లు విచారించింది. రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి మరీ విచారణ జరిపింది. దాంతో పాటు ఆమె ఇంటికి కూడా ఒకసారి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు.

ఆ సమయంలో నిజా నిజాలు తేలలేదు కాబట్టి అదంతా బిజెపి కుట్ర అంటూ టిఆర్ఎస్ వర్గాలు ఖండించాయి. కానీ తాజాగా సిబిఐ అధికారులు తీసుకున్న స్టెప్పు కవితకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశమే. అసలే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కవిత వ్యవహారం మింగుడు పడ లేకుండా ఉంది. మరి దీనిపై బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News