Kalki 2898 AD Glimpse Movie : కల్కి సినిమాలో ఎన్టీఆర్.. గూస్ బంప్స్ న్యూస్ వైరల్..!
Qubetvnews - February 19, 2024 / 11:36 AM IST
Kalki 2898 AD Glimpse Movie :
ఇప్పుడు ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇండియాలోని అన్ని భాషల ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ సినిమాలను తీస్తున్నారు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మూవీ కల్కి అయితే ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. ఇండియాలోనే ఈ సినిమా భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా దాన్ని తెరకెక్కిస్తున్నారు. కలియుగం అంతం అవుతుందనే నేపథ్యంలో దాన్ని తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్లు పెంచేశాయి.
ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కు గేమ్ ఛేంజర్ లాగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, రానాలు కనిపించబోతున్నారు. ఇక వీరితో పాటు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి బిగ్గెస్ట్ డైరెక్టర్లు కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాస్టింగ్ వైజ్‌గా ఇప్పటికే ఇది అతి పెద్ద మూవీగా నిలిచింది. అయితే ఇవి సరిపోలేదని డైరెక్టర్ భావించారరేమో.
ఇప్పుడు ఓ సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ వార్త వినడానికి కూడా పూనకాలు వచ్చే విధంగా ఉంది. అదేంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడంట. ఆయన ఓ చిన్న కొమియో పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్క్రిప్ట్ రైటింగ్‌లో పనిచేస్తున్నకేశవ చంద్ర హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కల్కి సినిమాలో కనిపిస్తాడా అని నెటిజన్లు అడిగారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. సినిమా చూసి మీరే తెలుసుకోండి అంటూ చెప్పడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు.
ఒకవేళ ఎన్టీఆర్ లేకపోతే ఆయన కూడా అదేం లేదని చెప్పేవారు కదా.. కానీ అలాంటిదేమీ చెప్పకుండానే ఆయన హింట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే నిజమైతే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

Kalki 2898 AD Glimpse Movie New Update
ఈ సినిమాకు ఇక తిరుగు ఉండదని అంటున్నారు. ఈ వార్తతో ప్రభాస్, ఎన్టీఆర్ ను ఒకే సినిమాలో చూడబోతున్నామనే వార్త వారిని తెగ ఖుషీ చేస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు పురాణాలతో కూడా టచ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.



