KTR : మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో బీఆర్ఎస్.. కేటీఆర్ పోస్టు అందుకేనా..!

Qubetvnews - February 17, 2024 / 06:57 AM IST

KTR  : మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో బీఆర్ఎస్.. కేటీఆర్ పోస్టు అందుకేనా..!

KTR  :

చూస్తుంటే బీఆర్ ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ కు బ్రహ్మాస్త్రం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోనే బీఆర్ ఎస్ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ ఎస్ మాత్రమే అనే స్టేట్ మెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసింది. అది గత పదేండ్లుగా బీఆర్ ఎస్ కు శ్రీరామ రక్షలా కాపాడుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన క్రెడిట్ కారణంగానే బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చేసింది. అప్పుడు టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం బాగా కలిసి వచ్చింది. దాంతో బీఆర్ఎస్ కు తిరుగులేని మెజార్టీ వచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చలేదు. కేవలం తాము చేసిన పనులను మాత్రమే చెప్పుకుంది. దాంతో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పై పోరాటాన్ని గతంలో తాము ఉద్యమ సమయంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేసేలా ఉండాలని బీఆర్ ఎస్ ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది.

KTR Remembered Days Of Assembly Telangana Movement

KTR Remembered Days Of Assembly Telangana Movement

అసలు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ అన్నట్టు నినాదాన్ని ప్రజల్లోకి మళ్లీ వెళ్లేలా చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు అద్దం పడుతోంది. మొన్న అసెంబ్లీలో మీడియా పాయింట్ కు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు అధికారులు. దాంతో అక్కడే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కింద కూర్చుని నిరసనలు తెలిపారు. అయితే ఇప్పుడు అదే ఫొటోను గతంలో తాము ఉద్యమ సమయంలో కింద కూర్చున్న ఫొటోలతో కలిపి పోస్టు చేశారు కేటీఆర్.

KTR Remembered Days Of Assembly Telangana Movement

KTR Remembered Days Of Assembly Telangana Movement

ఉద్యమ సమయంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పట్లో పోరాడిన చరిత్ర మాకు ఉంది.. ఇప్పుడు మళ్లీ అదే ఉద్యమ స్పూర్తితో పోరాడుతాం అన్నట్టు ఆయన పోస్టు పెట్టారు. దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

KTR Remembered Days Of Assembly Telangana Movement

KTR Remembered Days Of Assembly Telangana Movement

లోకల్ పార్టీగా తెలంగాణ కోసం పోరాడేది తామే అన్నట్టు ప్రజలకు తెలియజేయాలని అనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే మొన్న ఛలో నల్గొండ సభలో కూడా కేసీఆర్ ఇలాంటి తెలంగాణ సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. మొత్తానికి బీఆర్ ఎస్ తిరిగి యూటర్న్ తీసుకోవడం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News