WPL 2024 : మరో మూడు రోజుల్లో టోర్నీ.. ఆర్సీబీ, గుజరాత్ లకు ఊహించని షాక్‌

Qubetvnews - February 20, 2024 / 05:45 PM IST

WPL 2024 : మరో మూడు రోజుల్లో టోర్నీ.. ఆర్సీబీ, గుజరాత్ లకు ఊహించని షాక్‌

WPL 2024 :

WPL 2024 మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. అంతకు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లకు భారీ షాక్ తగిలింది.

ఆర్సీబీ ఆల్ రౌండర్ కనికా అహుజా, గుజరాత్ జెయింట్స్ పేసర్ కశ్వీ గౌతమ్ రెండో సీజన్ నుంచి తప్పుకున్నారు. కశ్వీ గాయపడగా, మానసిక ఒత్తిడి కారణంగా అహుజా ఈ సీజన్‌కు దూరమయ్యారు. మొత్తంగా గాయాల కారణంగా వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యారు. డబ్ల్యూపీఎల్-2 వేలంలో రెండు కోట్ల రూపాయలకు గుజరాత్ కొనుగోలు చేసిన కశ్వీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లీగ్‌కు దూరమవడం గమనార్హం.

కనికా అహుజా గత సీజన్‌లో ఆర్సీబీ తరపున ఎనిమిది మ్యాచుల్లో ఎనిమిది ఆడింది. ఆల్ రౌండర్ అహుజా 98 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. ఆర్సీబీ లోయర్ ఆర్డర్‌లో తెలివైన అహుజా స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ శ్రద్ధా పోఖార్కర్‌ను తీసుకుంటోంది. శ్రద్ధా దేశంలో నిలకడగా రాణిస్తోంది. ఆమె రూ. 10 లక్షల కనీస ధరతో ఆర్సీబీలో చేరనుంది.

రెండో సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచిన కశ్వీ గాయం కారణంగా సీజన్‌కు దూరమయ్యారు. జాతీయ జట్టులో మెరుస్తున్న కశ్వీ ఈ సీజన్‌లో మెరిసి భారత జట్టులోకి వస్తుందని భావించినా గాయం ఆశలపై నీళ్లు చల్లింది. పేసర్ల కొరతతో ఉన్న గుజరాత్‌కు ఇది కూడా పెద్ద ఎదురుదెబ్బే. కశ్వీ స్థానంలో గుజరాత్ జట్టులో సయాలీ సతగారేను తీసుకున్నారు. సయాలీతో రూ.10 లక్షల కనీస ధరకు గుజరాత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డబ్ల్యూపీఎల్‌-2024 వేలంలో కాశ్వీని రూ.2 కోట్ల భారీ ధరకు గుజరాత్‌ సొంతం చేసుకుంది.

 Second Season Of WPL 2024 Womens Premier League About Begin

Second Season Of WPL 2024 Womens Premier League About Begin

డ‌బ్ల్యూపీఎల్‌ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ఆరంభం కానుంది. ఈ వేడుకకు బాలీవుడ్ హీరోలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. హీరోలు సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్‌లు డ‌బ్ల్యూపీఎల్‌ 2024 ప్రారంభ వేడుకలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రారంభ వేడుక శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆరంభం అవుతుంది. వీరితో పాటు మరికొందరు స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

 Second Season Of WPL 2024 Womens Premier League About Begin

Second Season Of WPL 2024 Womens Premier League About Begin

జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రారంభ వేడుక సహా మ్యాచ్ ప్రసారం అవుతుంది. డ‌బ్ల్యూపీఎల్‌ 2024 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు టీమ్స్ 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి.రెండో సీజ‌న్‌లో రెండు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. బెంగళూరు లెగ్ మార్చి 4 వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి టోర్నీ తరలిపోతుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు 24 రోజులు జరగనుండగా.. డబుల్ హెడర్‌లు మాత్రం లేవు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మార్చి 15న ఎలిమినేట‌ర్ మ్యాచ్, 17న ఫైన‌ల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి.

https://twitter.com/wplt20/status/1759789588422492335?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1759789588422492335%7Ctwgr%5E69388316ec95fdf776ee1c7cdeea2dce3ce4a162%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fsports%2Fcricket-news%2Fwomens-premier-league-is-set-to-begin-on-february-23-check-full-schedule-and-live-streaming-details-in-telugu-1185412.html

https://twitter.com/wplt20/status/1759573508823421387?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1759573508823421387%7Ctwgr%5Efddb7aef816d62100990d676a508e900eb738a05%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.newsbytesapp.com%2Fnews%2Fsports%2Fwpl-2024-opening-ceremony-will-feature-bollywood-stars-kartik-aaryan-and-sidharth-malhotra%2Fstory

https://twitter.com/wplt20/status/1759834160900739529?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1759834160900739529%7Ctwgr%5Efddb7aef816d62100990d676a508e900eb738a05%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.newsbytesapp.com%2Fnews%2Fsports%2Fwpl-2024-opening-ceremony-will-feature-bollywood-stars-kartik-aaryan-and-sidharth-malhotra%2Fstory

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News