Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ కు విజయనగరం కుర్రాడు.. ఇది కదా జగన్ పనితనం అంటే..!

Qubetvnews - February 17, 2024 / 06:55 AM IST

Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ కు విజయనగరం కుర్రాడు.. ఇది కదా జగన్ పనితనం అంటే..!

Chennai Super Kings :

జగన్ ఎన్నడూ కూడా తనకు అండగా ఉండే పనులను ఎంచుకోలేదు. కేవలం జనాలకు పనికొచ్చే పనలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. కేవలం జనాలకు ఉపయోగపడే పనులే కాకుండా అసలు రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలన ఉద్దేశం ఆయనలో మెండుగా ఉంది. అందుకే కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆయన పని చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపడుతున్న నిర్ణయాలు అందరికీ బాగానే నచ్చుతున్నాయి. తాజాగా ఆయన నిర్ణయం మరో యువకుడికి జీవితాన్ని ప్రసాదించింది.

ఈ విషయాన్ని మేము చెప్పట్లేదండోయ్.. ఆయన సాధించిన రికార్డులే చెబుతున్నాయి. రాజకీయంగా లబ్ది పొందే రాజీకయ పార్టీలు ఉన్న ఈ కాలంలో ప్రజా పాలనే లక్ష్యంగా జగన్ సాధిస్తున్న పాలన అందరికీ ఆదర్శంగానే అనిపిస్తోంది. తరచి చూస్తే అయన అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అంతిమంగా సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది అయి ఉంటుంది. ఇన్ని రోజులు జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయని వైసీపీ నేతలే స్వయంగా ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు తాము చేపడుతున్న కార్యక్రమాలతో ఎంత లాభం ఉందో టీడీపీ అంచనా వేయలేకపోయిందని అంటున్నారు.

తాజాగా విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన పవన్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ విషయం తాజాగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది. త్వరలోనే జరిగే ఐపీఎల్ కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో ఇప్పుడు పవన్ ను తమ టీమ్ లోకి తీసుకుంటామని సీఎస్కే తెలిపింది. త్వరలోనే పవన్ ను చెన్నై తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించి ఆయన్ను టీమ్ లోకి తీసుకుంటామని సీఎస్కే తెలిపింది. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించిన పవన్ కు ఇది గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి.

త్వరలోనే పవన్ అనుకున్న లక్ష్యానికి చేరకుంటాడని ఆయన మిత్రులు చెబుతున్నారు. అయితే పవన్ మాట్లాడుతూ తాను ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనడం వల్లనే తన ప్రతిభను సీఎస్కే టీమ్ గుర్తించిందని చెబుతున్నారు. జగన్ ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ వల్లనే తనలోని ప్రతిభ ఈరోజు అందరూ చూడగలుగుతున్నాడని చెబుతున్నారు.

Pawan Got Chance To Play In Chennai Super Kings Team

Pawan Got Chance To Play In Chennai Super Kings Team

దీన్ని బట్టి జగన్ చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. జగన్ చేపట్టిన కార్యక్రమం వల్లనే మరుగున పడ్డ చాలా మంది ప్రతిభ ఈరోజు బయటపడుతుందని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News