KCR : ఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ కొత్త వ్యూహం..!

Qubetvnews - March 12, 2024 / 09:42 AM IST

KCR : ఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ కొత్త వ్యూహం..!

KCR : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంటాయి. ఎన్నికల నినాదాల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఎన్నికల ప్రచారం వరకు ముందే వ్యూహాలను నిర్ణయించుకుంటాయి. అందుకే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇలా కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ హీటు పుట్టిస్తున్నాయి. ఇటు లోకల్ పార్టీ అయిన బీఆర్ ఎస్ కూడా ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు గట్టి దెబ్బ పడింది.

దాంతో ఇప్పటి నుంచే కేసీఆర్ అలెర్ట్ అవుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ గ్రాఫ్ ను కాపాడుకోవాలంటే కచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎవరికి పడితే వారికి టికెట్లు ఇవ్వకుండా అక్కడ గెలిచే సత్తా ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ప్రచారంలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సభలను నిర్వహించారు.

కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు చేయలేదు. కేటీఆర్ కూడా చాలా వరకు సభలే నిర్వహించారు. కానీ రోడ్ షోలు చేయలేదు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రోడ్ షోలు, బహిరంగ సభలు మాత్రమే చేపట్టాలని డిసైడ్ అయ్యారంట గులాబీ బాస్. ఈ సారి తానే స్వయంగా రోడ్ షోలు చేయాలని వ్యూహాలు రచిస్తున్నారంట. ఎందుకంటే ప్రజల్లోకి స్వయంగా తానే వెళ్లాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేసీఆర్ ఇలాంటి రోడ్ షోలను గతంలో ఏ ఎన్నికలకు కూడా చేయలేదు.

అదే ఆయన్ను ప్రజలకు దూరంగా ఉంచుతుందని కొన్ని సర్వేల్లో తేలిందంట. అందుకే ప్రజలకు దగ్గరగా వెళ్లాలంటే రోడ్ షోలు చేస్తేనే బాగుంటుందని కేసీఆర్ భావించారంట. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజలకు దగ్గరగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇది కేసీఆర్ కు కలిసొచ్చే అంశం అనే అంటున్నారు.

మొత్తానికి కేసీఆర్ చేస్తున్న పని ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ నిపుణులు.. అందుకే ఇలా రోడ్ షోలను ప్లాన్ చేస్తున్నారంట కేసీఆర్. మరి ఇలా చేయడం ఆయనకు ఎంత వరకు కలిసి వస్తుందనేది ఈ ఎన్నికల్లో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News