Revanth Reddy : టార్గెట్ 14.. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్న రేవంత్..!
Qubetvnews - April 7, 2024 / 10:25 AM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు కాస్త ఆచి తూచి అడుగులు వేసిన అతను.. ఇప్పుడు మాత్రం బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ ముందు ఎంపీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఓటమి ఎరగని కేసీఆర్ ను గద్దె దించి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎన్నికల బాధ్యతలను కూడా రేవంత్ నెత్తిన పెట్టింది ఢిల్లీ అధిష్టానం. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి ఎంపీ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకు కనీసం 14 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను కూడా నియమించారు రేవంత్ రెడ్డి. అయితే ఇది సరిపోదని భావిస్తున్నారు కాబోలు. అందుకే ఇప్పటికే గట్టి అభ్యర్థులను బీఆర్ ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు. వారికే టికెట్లు కూడా కేటాయించుకున్నారు. అయినా సరే ఈ సారి బీజేపీ, బీఆర్ ఎస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని రేవంత్ రెడ్డికి అర్థం అయింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే గట్టి ప్లాన్ ఉండాలని అనుకుంటున్నారు.
ఇందులో భాగంగా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో బలంగా ఉన్న లీడర్లను కూడా చేర్చుకోవాలని భావిస్తున్నారంట. ఎంపీ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని బీఆర్ ఎస్, బీజేపీనుంచి కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. వచ్చేవారం తర్వాత ఆ రెండు పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకోసం భారీగానే ప్లాన్ వేస్తున్నారంట రేవంత్ రెడ్డి. వచ్చే వారికి ఎమ్మెల్సీ పదవి లేదంటే నామినేటెడ్ పోస్టులను ఆశగా చూపించి వారిని చేర్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకోసం భారీగా కసరత్తు చేయబోతున్నారంట.
ఆయా పార్లమెంట్ లో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్టుగా బీఆర్ ఎస్, బీజేపీ అసంతృప్త లీడర్లు తోడు అయితే మాత్రం కచ్చితంగా ఆశాజనక ఫలితాలు ఉంటాయని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి రేవంత్ ప్లాన్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో.


