Ap Elections : ఏఎల్ ఎన్ సర్వే.. ఏపీలో అధికారం జగన్ దే..!

Qubetvnews - April 29, 2024 / 03:10 PM IST

Ap Elections : ఏఎల్ ఎన్ సర్వే.. ఏపీలో అధికారం జగన్ దే..!

Ap Elections : ఏపీలో ఎన్నికల సమరం దగ్గరపడుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఇటుఏపీలో మాత్రం పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశంమీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేచేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటికే ఏపీకి చాలానే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అందులో మెజార్టీ సర్వేలు కూడా వైసీపీదే విజయం అని తేల్చేస్తున్నాయి. ఇక తాజాగా మరో సర్వే తన ఫలితాలు విడుదల చేసింది.

తాజాగా ఏఎల్ ఎన్ అనే సంస్థ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సంస్థ కొన్ని రోజులుగా ఏపీలో ఈ సర్వేను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తన ఫలితాల్లో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని తేల్చి చెప్పేసింది. వైసీపీ తిరుగులేని మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పేసింది. ఈ సారి వైసీపీకి ఏకంగా 149 సీట్లువస్తాయని చెప్పింది ఈ సర్వే. గత ఫలితాలతో పోలిస్తే కేవలం రెండు సీట్లు మాత్రమే తగ్గుతాయని చెప్పేసింది. మెజార్టీ సీట్లతో విజయం సాధిస్తుందని చెప్పేసింది ఈ సర్వే. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మాత్రం అంత సీన్ లేదని ఈ సర్వే తేల్చేసింది.

ఆ కూటమికి కేవలం 26 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది ఈ సర్వే. మూడు పార్టీలు కలిసినా సరే ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశాలు లేవని తేల్చేసింది ఈ సర్వే. ఇక వైసీపీకి ఏకంగా 51% ఓట్లు వస్తాయని తెలిపింది. అటుకూటమికి మాత్రం కేవలం 41% ఓటింగ్ మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ కూటమికి మాత్రం కేవలం 4% మాత్రమే ఓట్లు వస్తాయని తెలిపింది. ఇంకా 4% మాత్రం ఎవరికీ వేయరని స్పష్టం చేసింది ఈ సర్వే. ఇక వైసీపీకి 10వేల మెజార్టీ ఓట్లతో గెలిచే సీట్లు 79 ఉంటాయని.. 5వేల నుంచి 10 వేల మధ్య మెజార్టీతో గెలిచే సీట్లు 57 ఉంటాయని తెలిపింది.

ఇక ఐదు వేల లోపు ఓట్లతో గెలిచే సీట్లు 13 ఉంటాయని తెలిపింది ఈ సర్వే. మొత్తంగా మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని తేల్చేసింది ఈ సర్వే. దాంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అటు పొత్తులతోబలం పెరిగిందని భావిస్తున్న చంద్రబాబు అండ్ కోకు మరోసారి ఈ సర్వేలో కూడా షాక్ తగిలింది.

ఇక షర్మిల రాకతో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కూటమికి కూడా పెద్ద దెబ్బే తగిలింది. ఏదేమైనా మురోసారి జగన్ ను ఢీకొట్టే నాయకుడు ఇప్పట్లో రాడని సర్వేలే బలంగా చెబుతున్నాయి. కాబట్టి జగన్ కు మెజార్టీ సీట్లతో మరోసారి అధికారం ఖాయం అని స్పష్టం అవుతోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News