Fake Exit Polls : ఆ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మేదెలా.. టీడీపీ భజన చేస్తున్నాయా..?
Qubetvnews - June 1, 2024 / 09:07 PM IST
Fake Exit Polls : ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సమయంలో ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కౌంటింగ్ ఫలితాల కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి. అయితే ఈ సారి ఎంత లేదన్నా వైసీపీకి టీడీపీ కూటమి కొంత పోటీ ఇచ్చింది. అందులో డౌట్ లేదు. కానీ వైసీపీని ఓడించేంత పోటీ ఇచ్చిందా అంటే అనుమానమే. ఇలాంటి సమయంలో తాజాగా కూటమిని కొన్ని సంస్థలు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నాయి. మొన్నటి పోలింగ్ సమయంలో టీడీపీకి అనుకూలంగా కొన్ని వ్యవస్థలు నడుచుకున్న విధానం మనం చూశాం.
అంతే కాకుండా ఎన్నికల పోలింగ్ కు ముందే కొన్ని సంస్థలు సర్వేల పేరుతో టీడీపీ భజన చేశాయి. ఆ సర్వేల్లో టీడీపీ కూటమి భారీ సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. చాలా వరకు జాతీయ సంస్థలు కూడా వచ్చి వైసీపీ విజయం సాధిస్తుందని చెబితే.. కొన్ని లోకల్ సర్వే సంస్థలు మాత్రం బాబు భజన చేశాయి. దాంతో వైసీపీతో పాటు అటు నెటిజన్ల ఆగ్రహానికి సదరు సంస్థలు గురికాక తప్పలేదు. ఇక తాజగా ఇప్పుడు జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. జూన్ 4న కౌంటింగ్ ఫలితాలు రావాల్సి ఉంది. కానీ చివరిదశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి.
అయితే ఇప్పుడు కూడా మెజార్టీ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకే అధికారం దక్కుతుందని తేల్చి చెప్పాయి. కానీ కొన్ని సంస్థలు మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. అందులో ఎక్కువగా లోకల్ సంస్థలే ఉండటం విశేషం. జాతీయ మీడియా సంస్థలు కూడా వైసీపీకే అధికారం దక్కుతుందని చెబితే.. లోకల్ సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని చెప్పడంలో బాబు భక్తి కనిపిస్తోందని అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే సదరు సర్వే సంస్థలు గతంలో కూడా ఇలాంటి ఫేక్ సర్వే రిపోర్టులను వెల్లడించినట్టు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఇలాంటి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించి బాబును తృప్తి పరుస్తున్నట్టు చెబుతున్నారు వైసీపీ నేతలు. ప్రముఖ సంస్థలు అన్నీ వైసీపీదే విజయం అని చెబుతున్నాయని.. కాబట్టి జగనే సీఎం కాబోతున్నారని సంస్థలు తేల్చి చెబుతున్నాయి. చూడాలి మరి విజయం ఎవరిదో.




