Stone Politics : అగ్ర నేతలపై రాళ్ల దాడులు.. ఎవరిది స్క్రిప్టు.. ఎవరిది ఒరిజినల్..?
Qubetvnews - April 15, 2024 / 12:16 PM IST
Stone Politics : ఏపీలో ఇప్పుడు మాటల దాడిని దాడి రాళ్ల దాడుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న విజయవాడలో జగన్ బస్సు యాత్ర చేస్తుండగా అభిమానులు పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కరెంట్ పోవడంతో అదే సమయంలో రాళ్ల దాడి కూడా జరిగింది. ఆ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మకు గాయం కూడా అయింది. రక్తస్రావం కూడా జరిగింది. అయితే దానిపై వెంటనే టీడీపీ పార్టీ స్పందించింది. అదంతా వైసీపీ డ్రామా అంటూ కొట్టి పారేసింది. కానీ ప్రధాని మోడీ స్పందించి ఆ దాడిని ఖండించిన తర్వాత చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు.
ఆ దాడిని ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఆ దాడిని ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే వీరిద్దరి చర్యల వల్ల జగన్ పై దాడి నిజమే అనిచెప్పారన్నమాట. దాంతో జగన్ పై దాడిని అటు ఏపీ ప్రజలు కూడా ఖండిస్తున్నారు. అయితే జగన్ పై దాడి జరిగిన మరుసటి రోజు అంటే ఆదివారం రాత్రి విజయనగరం లోని పాత గాజువాక జంక్షన్ లో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. అయితే ఇక్కడ రాయి చంద్రబాబకు తగలలేదు. ఆయన ముందు ఉన్న కారు బారికేడ్లకు తాకింది. పెద్దగా శబ్దం రావడంతో సెక్యూరిటీ అలెర్ట్ అయింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వారిహి యాత్రపై రాళ్ల దాడి జరిగినట్టు జనసైనికులు చెబుతున్నారు. అయితే ఎవరూ రాళ్లు విసరలేదని రాయి విసుతాడేమో అనుకుని పవన్ అభిమానులు పట్టుకుని తమకు అప్పగించినట్టు తెలుపుతున్నారు పోలీసులు. అంటే ఇక్కడ ఎవరిది స్క్రిప్టు ఎవరిది నిజమనేది ప్రజలు గమనించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు. జగన్ ది స్క్రిప్టు అయితే చీకట్లో దూరం నుంచి రాయి వచ్చి తగులుతుందా అని అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ది కూడా నిజమైన దాడి అనికుంటే.. వారికి కూడా జగన్ లాగా గాయాలు కావాలి కదా అని చెబుతున్నారు.
అలా గాయాలు కాకుండా ఉన్నాయంటే కచ్చితంగా జగన్ లాగా వాళ్లది నిజమైన దాడి కాదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. రాళ్లదాడి నేపథ్యంలో జగన్ కు బాగా ఆదరణ పెరుగుతోంది. దాన్ని కవర్ చేయడం కోసం తమపై కూడా రాళ్ల దాడి జరిగినట్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్క్రిప్టు రాసుకున్నారు.
కానీ ఆ స్క్రిప్టును కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారని వైసీపీ కౌంటర్ వేస్తోంది. ఒకవేళ నిజంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రాళ్ల దాడి కుట్ర ఉంటే జగన్ కంటే ముందే ఎందుకు వాళ్లపై దాడి జరగలేదు. పోనీ ఆ రాయి అయినా వాళ్లకు తాకాలి కదా.. ఇలా అడ్డంగా దొరికిపోయే ప్లాన్లు ఎందుకు వేస్తారంటూ ప్రజలు మండిపడుతున్నారు.




