Chandrababu : రేవంత్ పై ఒత్తిడి పెంచుతున్న చంద్రబాబు.. మున్ముందు కష్టమేనా..?

Qubetvnews - June 18, 2024 / 08:10 PM IST

Chandrababu : రేవంత్ పై ఒత్తిడి పెంచుతున్న చంద్రబాబు.. మున్ముందు కష్టమేనా..?

Chandrababu : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే.. తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ ఇక్కడే రేవంత్ కు చంద్రబాబుతో చిక్కులు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ కు ఇప్పటి వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ చంద్రబాబుకు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఆరు నెలలు అవుతోంది. కానీ ఇప్పటికీ తన మార్క్ ను పెద్దగా చూపించుకోలేకపోతున్నారు.

ఇచ్చిన హామీల్లో ఇప్పటికి కేవలం రెండు మాత్రమే అమలు చేస్తున్నారు. వంద రోజుల్లో అది చేస్తా.. ఇది చేస్తా అంటున్నారే తప్ప.. ఇప్పటి వరకు ప్రజల్లో తన ముద్రను మాత్రం వేసుకోలేకపోతున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కి వారం కాక ముందే తన మార్క్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు ఫైళ్ల మీద సంతకం చేసి ప్రజల్లో ఒక్కసారిగా గ్రాఫ్‌ పెంచేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి మొదలైంది. చంద్రబాబుకంటే సొంతంగా పార్టీ ఉంది. ఆయన చెప్పిన మాటను ఎవరూ గీత దాటిపోలేరు.

ఆయన ఏం చెప్పినా కాదనే వారే లేరు. కానీ రేవంత్ పరిస్థితి అలా లేదు. ఆయనకు సీనియర్లు ఎప్పుడు వ్యతిరేకంగా మారేది తెలియదు. పైగా అసెంబ్లీలో మెజార్టీ సీట్లు కూడా పెద్దగా లేవు. ఎప్పుడు ప్రతిపక్షాలు సందు చూసి కూల్చేస్తాయో అనే భయం వెంటాడుతోంది. దాంతో పాటు ఏ పని చేయాలన్నా.. ఏ పథకం అమలు చేయాలన్నా సరే సీనియర్లందరినీ ఒప్పించాల్సి వస్తోంది. దాంతో పాటు ఆయనకు పాలనా అనుభవం చాలా తక్కువ. తనకు పాలనా అనుభవం కాబట్టి.. ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థలి సంతృప్తి పరిచేసరికి.. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులను అర్థం చేసుకునే సరికే సమయం అయిపోతోంది.

కానీ చంద్రబాబుకు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి.. వ్యవస్థల్ని ఎలా మ్యానేజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే పాలనలో రేవంత్ కంటూ దూసుకుపోతున్నారు. మున్ముందు చంద్రబాబు అమరావతిని కూడా డెవలప్ చేస్తే మాత్రం రేవంత్ తేలిపోయే అవకాశం ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News