Chandrababu : రేవంత్ చేసిన పనే చేయబోతున్న చంద్రబాబు.. రేవంత్ చేసిన పనే చేయబోతున్న చంద్రబాబు..?
Qubetvnews - June 18, 2024 / 08:17 PM IST
Chandrababu : ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి రాజకీయాలే వేరే విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే వాటిని సరిచేసుకునే విధంగా ప్రభుత్వాలు మెదులుకునేవి. కానీ ఇప్పటి రాజకీయాలు అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఒకొప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యంవంతం అవుతున్నారు కాబట్టి.. ఒకే పార్టీని గెలిపించకుండా.. ఫామ్ లో ఉన్న అన్ని పార్టీలుకు ఏదో ఒక సమయంలో అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. అందుకే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా అవతలి పార్టీని టార్గెట్ చేస్తోంది.
ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న పని కూడా ఇదే. రేవంత్ సర్కార్ హామీలను అమలు చేయట్లేదని బీఆర్ ఎస్ టార్గెట్ చేస్తుంటే.. బీఆర్ ఎస్ పదేండ్ల హయాంలో చేసిన పనులపై కమిషన్లు వేస్తూ.. అవకతవకలు జరిగాయంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఆటోమేటిక్ గా ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును అన్నింటికంటే ముందుగా సందర్శించారు.
అయితే పోలవరం ప్రాజెక్టును తాను ఏపీకి తీసుకొస్తే… జగన్ దాన్ని నాశనం చేశాడు అంటూ అప్పుడే విమర్శలు స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. జగన్ హయాంలో చాలానే అక్రమాలు జరిగాయని.. వాటిని విడిచిపెట్టబోనంటూ తెలుపుతున్నారు. అంటే రాబోయే కాలంలో జగన్ హయాంలో చేసిన పనులు, ప్రాజెక్టులు, పథకాలపై కమిషన్లు వేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా జగన్ ను రాబోయే కాలంలో టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే చాలా కష్టం.
కాబట్టి కచ్చితంగా మేనిఫెస్టోను అమలు చేయట్లేదంటూ వైసీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. కాబట్టి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ పార్టీ మీదనే ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ఉంటాయని తెలుస్తోంది. అదే జరిగితే కచ్చితంగా రాబోయే రోజుల్లో ఏపీలో తెలంగాణ రాజకీయాలు రిపీట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.





