Chandrababu : ఆ క్రెడిట్ అంతా బాబు, పవన్ కే.. బీజేపీకి దక్కట్లేదా..?
Qubetvnews - July 2, 2024 / 09:29 PM IST
Chandrababu : ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా మూడు పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీలకు క్రెడిట్ దక్కాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా కనిపించట్లేదు. క్రెడిట్ మొత్తం కేవలం టీడీపీ, జనసేనకే దక్కుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైలెట్ అయ్యారు. ఇక బీజేపీ తరఫున కేవలం కేంద్ర నేతలే కనిపించారు తప్ప.. రాష్ట్ర నేతలను అస్సలు పట్టించుకోలేదు.
చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడాలన్నా సరే.. కేంద్రంలోని అమిత్ షా, మోడీలతోనే చర్చించారు. అంతే తప్ప పురంధేశ్వరిని ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పింఛన్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం చంద్రబాబు పింఛన్ల మీదనే చేశాడు. పింఛన్లను భారీగా పెంచుతూ పంపిణీ కూడా చేశారు. జులై 1 ఇంటింటికి వెళ్లి మరీ పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు పింఛన్లు పెంచిన క్రెడిట్ దక్కుతోంది. ఏపీ ప్రజల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది.
కానీ బీజేపీ ప్రస్తావన ఎక్కడా రావట్లేదు. అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సమయంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే మేనిఫెస్టోను పట్టుకోవడం, బీజేపీ నేత పట్టుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ మేనిఫెస్టోలో భారీగా ఉచిత పథకాల హామలు ఉన్నాయని.. రాష్ట్ర బడ్జెట్ ప్రకారం అవన్నీ అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని.. అందుకే బీజేపీ నేత ఆ మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి ఇష్టపడట్లేదని వైసీపీ అప్పట్లో సెటైర్లు వేసింది.
ఇప్పుడు పింఛన్లు పంచుతున్న క్రెడిట్ కూడా తమకు దక్కాలని బీజేపీ ఎక్కడా ఆరాటపడినట్టు కనిపించట్లేదు. దాంతో ఇప్పుడు బీజేపీకి క్రెడిట్ ఇవ్వట్లేదని కొందరు ఏపీ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ పవన్, చంద్రబాబు కావాలనే బీజేపీకి క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి మరి బీజేపీ దానిపై ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది.




